తాజా వైద్యారోగ్య శాఖ ప్రకటనను చూస్తే తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గినా మరో విషయం ఆందోళన కలిగిస్తోంది.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారినపడిన పడినవారి సంఖ్య 1,554గా వుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. 43,916మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా తాజా కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటివరకు నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 2,19,224కు చేరుకుంది.
కేసుల సంఖ్య కాస్త తగ్గడం ఊరటనిచ్చిన రికవరీల సంఖ్య కూడా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా పాజిటివ్ కేసుల కంటే తక్కువగా కేవలం 1,435మంది మాత్రమే కరోనా బారినుండి బయటపడ్డారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుండి సురక్షితంగా బయటపడ్డవారి సంఖ్య 1,94,653కి చేరింది.
undefined
read more నాయని నర్సింహా రెడ్డి ఆరోగ్యం విషమం: భార్య, అల్లుడు, మనవళ్లకు కరోనా
ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 88.79, మరణాల రేటు 0.57శాతంగా వుంటే దేశవ్యాప్తంగా ఇవి 87.5, 1.5 శాతంగా వున్నాయి. ఇప్పటికీ రాష్ట్రంలో 23,203యాక్టివ్ కేసులు వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
జిల్లాలవారిగా చూసుకుంటే అత్యధికంగా జిహెచ్ఎంసీ(హైదరాబాద్)లో 249, భద్రాద్రి కొత్తగూడెం 95, కరీంనగర్ 84, ఖమ్మం 88, మేడ్చల్ 118, నల్గొండ 79, రంగారెడ్డి 128, వరంగల్ అర్బన్ 53 కేసులు బయటపడ్డాయి. మిగతా జిల్లాలో కేసుల సంఖ్య నామమాత్రంగానే వున్నాయి.