తెలంగాణ కరోనా అప్ డేట్: ఆ జిల్లాలో... వరుసగా రెండోరోజూ జీరో కేసులు

Arun Kumar P   | Asianet News
Published : Dec 15, 2020, 09:38 AM ISTUpdated : Dec 15, 2020, 09:50 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: ఆ జిల్లాలో... వరుసగా రెండోరోజూ జీరో కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మెల్లిగా తగ్గుతూ వస్తోంది. 

హైదరాబాద్: తెలంగాణ కరోనా మహమ్మారి కోరల్లోంచి మెల్లిమెల్లిగా బయటపడుతోంది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో చాలా తక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో(ఆదివారం రాత్రి 8 గంటల నుండి సోమవారం రాత్రి 8 గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 48,005 మందికి టెస్టులు చేయగా కేవలం 491పాజిటివ్ కేసులు మాత్రమే బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా కేసుల సంఖ్య 2,78,599కి చేరగా మొత్తం టెస్టుల సంఖ్య 62,05,688కి చేరింది. 

రాష్ట్రంలో ఇటీవల టెస్టుల సంఖ్య పెరిగినా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది.  ఇక ఇప్పటికే కరోనా బారినపడిన వారిలో తాజాగా 596 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,69,828కి చేరింది. ఇలా కేసుల సంఖ్య తక్కువగా వుండి రికవరీల సంఖ్య ఎక్కువగా వుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 7,272 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. 

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో  ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1499కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 95.1శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 96.85శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే  జోగులాంబ గద్వాల జిల్లాలో వరుసగా రెండోరోజూ కేసులేవి నమోదుకాలేదు. అలాగే ఆదిలాబాద్ 6, కామారెడ్డి 4, నారాయణ పేట 3, భూపాలపల్లి 6, జనగామ 5, జగిత్యాల 10, వనపర్తి 2, అసిఫాబాద్ 7, మహబూబ్ నగర్ 10, మహబూబాబాద్ 8, మెదక్ 7, నాగర్ కర్నూల్ 9,  నిర్మల్ 10, నిజామాబాద్ 11,  సిరిసిల్ల 5, వికారాబాద్ 8, వరంగల్ రూరల్ 11,  ములుగు 12, పెద్దపల్లి 15, సిద్దిపేట 7, సూర్యాపేట 13, భువనగిరి 13, మంచిర్యాల 15, నల్గొండ 18 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 102కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ 33, రంగారెడ్డి 35, కొత్తగూడెం 21, కరీంనగర్ 29, ఖమ్మం 24,  సంగారెడ్డి 4,  వరంగల్ అర్బన్ 28కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు:


 

PREV
click me!

Recommended Stories

ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ ఇక యుద్ధం మొదలు | Kavitha New Political Party | Asianet News Telugu
ఒక్క క్లిక్.. జీవితం మటాష్! | Hyderabad CP VC Sajjanar Warning | IPL betting | Asianet News Telugu