తెలంగాణ కరోనాఅప్ డేట్: 25వేలు దాటిన యాక్టివ్ కేసులు

Arun Kumar P   | Asianet News
Published : Apr 14, 2021, 10:10 AM IST
తెలంగాణ కరోనాఅప్ డేట్: 25వేలు దాటిన యాక్టివ్ కేసులు

సారాంశం

 గత 24గంటల్లో అంటే సోమవారం రాత్రి 8గంటల నుండి మంగళవారం రాత్రి 8గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 72,364మందికి కరోనా టెస్టులు చేయగా 2157మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ మెల్లిమెల్లిగా పెరుగుతున్నాయి. తాజాగా గత 24గంటల్లో (సోమవారం రాత్రి 8గంటల నుండి మంగళవారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 72,364మందికి కరోనా టెస్టులు చేయగా 2157మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,34,738కు చేరితే టెస్టుల సంఖ్య 1,12,53,374కు చేరాయి.

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 821మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 3,07,499కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 25,459యాక్టివ్ కేసులు వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హోం/సంస్థల ఐసోలేషన్ లో వున్న వ్యక్తుల సంఖ్య 16,892గా వుంది.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఎనిమిది మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1780కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53శాతంగా వుంటే దేశంలో ఇది 1.2శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 88.9శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 91.86శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే వనపర్తి 21, నాగర్ కర్నూల్ 27, జోగులాంబ గద్వాల 13, కామారెడ్డి 57, ఆదిలాబాద్ 65, భూపాలపల్లి 11, జనగామ 12, జగిత్యాల 107, అసిఫాబాద్ 13, మహబూబ్ నగర్ 68, మహబూబాబాద్ 8, మెదక్ 28, నిర్మల్ 31, నిజామాబాద్ 187,  సిరిసిల్ల 31, వికారాబాద్ 35, వరంగల్ రూరల్ 14,  ములుగు 4, పెద్దపల్లి 21, సిద్దిపేట 59, సూర్యాపేట 29, భువనగిరి 18, మంచిర్యాల 51, నల్గొండ 68 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 361కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 245, రంగారెడ్డి 206, కొత్తగూడెం 24, కరీంనగర్ 74, ఖమ్మం 59, సంగారెడ్డి 135, వరంగల్ అర్బన్ 64కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు:   

 

PREV
click me!

Recommended Stories

100 కోట్లకు పైగా ఆస్తులు.. ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగళం| ACB Raids on Hyderabad | Asianet Telugu
RTC: ఎర్ర బ‌స్సులు ప‌చ్చ‌గా ఎందుకు మారాయి.? దీని వెన‌కాల ఉన్న అస‌లు కార‌ణం ఏంటో తెలుసా.?