తెలంగాణ కరోనా అప్ డేట్: హైదరాబాద్ అత్యధికం, నారాయణపేట్ అత్యల్పం

Published : Nov 12, 2020, 09:13 AM ISTUpdated : Nov 12, 2020, 09:26 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: హైదరాబాద్ అత్యధికం, నారాయణపేట్ అత్యల్పం

సారాంశం

తెలంగాణలో తాజాగా కరోనా కేసులు తక్కువగానే నమోదయ్యాయి. కేవలం 1015 కేసులు మాత్రమే బయటపడ్డట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య కాస్త తక్కువగానే నమోదవుతున్నాయి. తాజాగా గత 24గంటల్లో (మంగళవారం రాత్రి 8గంటల నుండి బుధవారం 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 40603 పరీక్షలు నిర్వహించగా 1015 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు జరిపిన మొత్తం టెస్టుల సంఖ్య 47,70,004కు చేరగా మొత్తం కేసుల సంఖ్య 2,54,666కు చేరాయి. 

ఇప్పటికే కరోనా బారినపడిన వారిలో 1716 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,35,950కి చేరింది. దీంతో  ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 17,323కి చేరింది. 

 ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1393కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 92.8శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 92.65శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే అత్యధికంగా హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో 172కేసులు నమోదయ్యాయి. ఇక మేడ్చల్ 97, రంగారెడ్డి 98, భద్రాద్రి కొత్తగూడెం 80, కరీంనగర్ 46, ఖమ్మం 48, నల్గొండ 57 కేసులు నమోదయ్యాయి. మిగతాజిల్లాలో కేసుల సంఖ్య కాస్త తక్కువగా వున్నాయి. 

పూర్తి వివరాలు:

 

PREV
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana
School Holidays : ఈ వారంలో ఇంకో నాల్రోజులే స్కూళ్లు నడిచేది.. తర్వాత వరుసగా మూడ్రోజులు సెలవులే