గ్రేటర్‌లో సర్వే: బీజేపీదే విజయమన్న బండి సంజయ్

By Siva KodatiFirst Published Nov 11, 2020, 8:59 PM IST
Highlights

బీసీల ప్రయోజనాలను మజ్లిస్‌ వద్ద కేసీఆర్‌ తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్‌. భాజపా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నాగోల్‌లో నిర్వహించిన ‘తెలంగాణ బీసీ గోస’ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు

బీసీల ప్రయోజనాలను మజ్లిస్‌ వద్ద కేసీఆర్‌ తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్‌. భాజపా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నాగోల్‌లో నిర్వహించిన ‘తెలంగాణ బీసీ గోస’ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంబీసీలకు రూ.10వేల కోట్లు కేటాయించామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. రూ.కోటి కూడా ఖర్చు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం బడుగు బలహీనవర్గాలను అణచివేస్తోందని లక్ష్మణ్ ధ్వజమెత్తారు.

ప్రభుత్వం బీసీ రిజర్వేషన్‌ను 33 నుంచి 22 శాతానికి తగ్గించి అన్యాయం చేసిందని ఆరోపించారు. రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, మజ్లిస్‌ను మట్టికరిపించి బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు.

Also Read:బిజెపికి బూస్ట్: బండి సంజయ్ ప్లస్ ఇదీ, రేవంత్ రెడ్డి మైనస్ అదీ...

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడుతూ పేదల జోలికి వస్తే ఎలా ఉంటుందో దుబ్బాక ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి చూపించారన్నారు. బీసీలపై సీఎం కేసీఆర్‌కు ప్రేమ ఉంటే టీఆర్ఎస్ అధ్యక్షుడిగా బీసీని నియమించాలని సంజయ్ డిమాండ్ డిమాండ్‌ చేశారు.

దుబ్బాక ప్రజల స్ఫూర్తితో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీని గెలిపించాలని సంజయ్‌ కోరారు. సీఎం కేసీఆర్ తన ఫాంహౌస్‌లో దొడ్డు బియ్యం పండిస్తారని, సన్నబియ్యం పండించాలని సూచించి రాష్ట్ర రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్ర ఖజానాను తీసుకెళ్లి హైదరాబాద్ పాతబస్తీలో ఖర్చు పెడుతున్నారని, అసలు పాతబస్తీలో పన్నులు ఎంత వసూలు చేశారో లెక్కలు చెప్పాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను బండి సంజయ్ డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించనుందని సర్వేలు సైతం చెబుతున్నాయని పేర్కొన్నారు. 

click me!