ఇనుప చువ్వలతో తలపై బాది...కంది చేళ్లో దారుణ హత్య

Arun Kumar P   | Asianet News
Published : Nov 12, 2020, 08:38 AM IST
ఇనుప చువ్వలతో తలపై బాది...కంది చేళ్లో దారుణ హత్య

సారాంశం

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ శివారులో రాంపల్లి రహదారి పక్కన కంది చేనులో బుధవారం తల మొత్తం చిద్రమైన స్థితిలో ఓ మృతదేహం కనిపించింది. 

సిద్దిపేట: తల మొత్తం చిద్రమైన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ శివారులో రాంపల్లి రహదారి పక్కన కంది చేనులో బుధవారం కనిపించింది. దీంతో స్థానికులు అందించిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడిని దుద్దెడకు చెందిన శ్రీనివాస్ గా గుర్తించారు.  

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దుద్దెడకు చెందిన  మేక శ్రీనివాస్ భార్య పిల్లలతో కలిసి సిద్దిపేటలో  నివాసముంటున్నాడు. ఓ ప్రైవేట్ కంపనీలో పనిచేసే అతడు మంగళవారం మద్యాహ్నం నాలుగు గంటలకు ఇంట్లో నుండి బయటకు వెళ్లి తిరిగిరాలేడు. ఫోన్ కూడా స్విచ్చాప్ కావడంతో ఆందోళనకు గురయిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 

అయితే బుధవారం స్వగ్రామం దుద్దెడ శివారులోని ఓ కంది చేనులో శ్రీనివాస్ మృతదేహం లభించింది. తలపై ఇనుప చువ్వలతో అతి దారుణంగా బాది హత్య చేశారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం సిద్దిపేట హాస్పిటల్ కు తరలించామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు హత్య చేసిన నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు