ఆర్టీసీ డ్రైవర్ మరణం.. భార్యకు ఉద్యోగం ఇప్పిస్తానని.. అత్యాచారం చేసిన టీఎంయూ నేత

Published : Sep 19, 2018, 10:29 AM IST
ఆర్టీసీ డ్రైవర్ మరణం.. భార్యకు ఉద్యోగం ఇప్పిస్తానని.. అత్యాచారం చేసిన టీఎంయూ నేత

సారాంశం

తన తోటి డ్రైవర్ మరణిస్తే.. అతని కుటుంబం పట్ల సానుభూతిని చూపాల్సింది పోయి డ్రైవర్ భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు మరో ఆర్టీసీ డ్రైవర్. బోడుప్పల్‌కు చెందిన శ్యాంసుందర్ రెడ్డి జీడిమెట్ల డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మరణించాడు.

తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఉపాధి చూపాలని అతని భార్య ఆర్టీసీ అధికారులను కోరింది. ఈ క్రమంలో చెంగిచర్ల డిపోలో డ్రైవర్‌గా, డీపో టీఎంయూ కార్యదర్శిగా పనిచేస్తున్న సోమసాయిలు పరిచయం అయ్యాడు.. యూనియన్ నాయకుడు కావడంతో న్యాయం చేస్తాడని నమ్మిన ఆమెకు అతనితో బాగా స్నేహం కుదిరింది.

అధికారులతో మాట్లాడి ఉద్యోగం వచ్చేలా చేస్తానని చెప్పి.. ఆమె నుంచి రూ.3 లక్షల నగదు, ఖాళీ చెక్కులు, ప్రామీసరీ నోట్లు తీసుకున్నాడు. ఒక రోజు ఉద్యోగం వచ్చిందని చెప్పి... పార్టీ ఇవ్వాలని కోరాడు. సాయిలు మాటలు నమ్మిన ఆమె ఆనందంగా ఇంట్లోనే పార్టీ ఇచ్చింది.

పీకల దాకా మద్యం తాగిన అతను ఆమెకు మత్త మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించాడు. మత్తులోకి జారుకున్న తర్వాత అత్యాచారానికి పాల్పడటంతో పాటు పలుమార్లు బెదిరించి తనను లోబరుచుకున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సోమసాయిలను అదుపులోకి తీసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu