ఫిబ్రవరి మూడో వారంలో మిలియన్ మార్చ్: కోదండరామ్

By narsimha lodeFirst Published Jan 4, 2021, 4:38 PM IST
Highlights

పిబ్రవరి మూడో వారంలో మరో మిలియన్ మార్చ్ నిర్వహించనున్నట్టుగా తెలంగాణ జనసమితి చీఫ్ కోదండరామ్ ప్రకటించారు.

హైదరాబాద్: పిబ్రవరి మూడో వారంలో మరో మిలియన్ మార్చ్ నిర్వహించనున్నట్టుగా తెలంగాణ జనసమితి చీఫ్ కోదండరామ్ ప్రకటించారు.

48 గంటల దీక్షను  సోమవారం నాడు  ఆయన దీక్షను ఆయన విరమించారు.  ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. నిరుద్యోగులు, రైతుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆదివారం నాడు  టీజేఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన 48 గంటల దీక్షను ప్రారంభించారు.

ధర్నా చౌక్ వద్ద దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో పార్టీ కార్యాలయంలో ఆయన దీక్షను నిర్వహించారు.ఉపాధి కోల్పోయినవారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ మాటలే తప్ప అమలు చేయడం లేదన్నారు.

తెలంగాణ ఉద్యమం కంటే తీవ్ర స్థాయిలో అభివృద్ది కోసం పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలో ఎన్నడూ చూడని దుర్భరం కన్పిస్తోందని చెప్పారు. 

ఉద్యోగులు, రైతులు,. ప్రైవేట్ టీచర్లు ఉపాధి కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నెల 20 వరకు జిల్లా సమావేశాలు నిర్వహించి నిరుద్యోగులను చైతన్యవంతుల్ని చేస్తామన్నారు.
 

click me!