తెలంగాణలోని ఒక గ్రామంలో కనీసం 21 వీధికుక్కలను గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు, ఈ షాకింగ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మహబూబ్‌నగర్ జిల్లా : తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ గ్రామంలో 21 వీధికుక్కలను గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపిన ఘటన కలకలం రేపుతోంది. ఆయుధాల చట్టం, జంతు హింస చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినా ఇప్పటి వరకు అనుమానితులను గుర్తించలేదు.
ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా పొన్నకల్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ గ్రామం జాతీయ రహదారికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది.గుర్తుతెలియని దుండగులు మారణాయుధాలతో ఈ మారణకాండకు పాల్పడ్డారు, దీంతో అనేక ఇతర కుక్కలు కూడా గాయపడ్డాయి.
'కాళేశ్వరంలో అవినీతిపై ఆ మూడు నివేదికల ఆధారంగా చర్యలు': అసెంబ్లీలో ఇరిగేషన్ పై శ్వేతపత్రం
పశుసంవర్థక శాఖ అధికారులు చనిపోయిన కుక్కలకు పోస్టుమార్టం నిర్వహించగా.. హత్యాకాండ, జరిగిన దారుణం బయటపడింది. స్థానికంగా తయారు చేసిన ఆయుధాలతో కుక్కలకు విషమిచ్చి అతి సమీపం నుంచి కాల్చి చంపినట్లు అడ్డాకల్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేశారు.
గ్రామంలో, రహదారి పక్కన సీసీ కెమెరాలు లేకపోవడంతో విచారణ క్లిష్టంగా మారింది. అయితే అధికారులు నిఘా కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటన వెనుక ఉద్దేశం ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనా స్థలంలో దొరికిన ఖాళీ కాట్రిడ్జ్‌లను గుర్తించడంతోపాటు ఆధారాలు సేకరించేందుకు క్లూస్ టీమ్‌ను నియమించారు.తుపాకీ గాయాలు లేకుండానే రెండు కుక్కలు చనిపోయాయని, అవి విషప్రయోగానికి గురై చనిపోయాయని పోలీసులు వెల్లడించారు.