రక్తమార్పిడితో మూడేళ్ల చిన్నారికి హెచ్ఐవీ: నల్లకుంట పోలీసులకు బాధిత కుటుంబం పిర్యాదు

By narsimha lode  |  First Published Aug 8, 2022, 4:58 PM IST

తలసేమియా వ్యాధి సోకిన మూడేళ్ల చిన్నారికి హెచ్ఐవీ సోకిన రక్తం ఎక్కించడంతో ఆ బాలుడికి ఎయిడ్స్ సోకింది. ఇందుకు బాధ్యులైన రెడ్ క్రాస్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని  బాధితుడి తండ్రి శివ డిమాండ్ చేస్తున్నారు. 



హైదరాబాద్:HIV సోకిన డోనర్ రక్తాన్ని అందించడంతో మూడేళ్ల తన కొడుకుకు ఎయిడ్స్ సోకిందని శివ అనే వ్యక్తి హైద్రాబాద్ Nallakunta పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.

Hyderabadకు చెందిన Shiva అనే వ్యక్తికి మూడేళ్ల కొడుకు ఉన్నాడు.తన కొడుకుకు Thalassemia వ్యాధి పుట్టుకతోనే వచ్చిందని శివ చెప్పారు. నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తే  15 రోజులకు ఒకసారి రక్త మార్పిడి చేయించాలని సూచించారన్నారు. ఈ సూచన మేరకు Red Cross నుండి ప్రతి 15 రోజులకు ఓసారి  రక్తమార్పిడి చేయిస్తున్నామని శివ చెప్పారని ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. 

Latest Videos

undefined

ఏడు మాసాల నుండి రక్త మార్పిడి చేయిస్తున్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు. అయితే గత మాసంలో తమ కొడుకుకు రక్త మార్పిడి కోసం రెడ్ క్రాస్ ఆసుపత్రికి వెళ్లిన సమయంలో తన కొడుకుకు హెచ్ఐవీ ఉందని రిపోర్టు ఇచ్చారన్నారు.  తనతో పాటు తన భార్యకు కూడా  టెస్టులు చేయిస్తే తమకు హెచ్ఐవీ లేదని రిపోర్టులు తేల్చాయని  శివ గుర్తు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది జూలై 28న తాము తమ కొడుకుకి రక్త మార్పిడికి వెళ్లిన సమయంలో రెడ్ క్రాస్ సిబ్బంది ఈ విషయం చెప్పారన్నారు. 

రెడ్ క్రాస్ సిబ్బంది మూలంగానే తమ కొడుకుకు హెచ్ఐవీ సోకిందని శివ ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఈ ఏడాది జూలై 30న నల్లకుంట పోలీసులకు పిర్యాదు చేసినట్టుగా శివ తెలిపారు. అయితే తన కొడుకుకు రెడ్ క్రాస్ నుండి రక్తం ఎక్కించలేదని రెడ్ క్రాస్ సిబ్బంది పోలీసులకు చెప్పారన్నారు. 

కానీ తాము రెడ్ క్రాస్ వద్దకు వెళ్లి రక్త మార్పిడి చేయించుకున్నట్టుగా తమ వద్ద ఉన్న ఆధారాలను కూడా పోలీసులకు సమర్పించినట్టుగా శివ తెలిపారని ఈ కథనం తెలిపింది.హెచ్ఐవీ ఉన్న రక్తం ఎక్కించి తన కొడుకు జీవితాన్నినాశనం చేసిన రెడ్ క్రాస్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని శివ డిమాండ్ చేస్తున్నారు. రక్తం ఎక్కించే సమయంలో జాగ్రత్తలు తీసకోని కారణంగానే తన కొడుకు హెచ్ఐవీ సోకిందని శివ ఆరోపిస్తున్నారని ఈ కథనం వెల్లడించింది.శివ కొడుకుకు రెడ్ క్రాస్ లో రక్త  మార్పిడి సమయంలోనే హెచ్ఐవీ సోకిందా లేదా ఇతరత్రా కారణాలతో ఈ వ్యాధి వ్యాప్తి చెందిందా అనే విషయమై పోలీసుల దర్యాప్తులో తేలనుంది. 
 

click me!