
ధాన్యం కొనుగోళ్లకు (paddy purchase) సంబంధించి తెలంగాణ బీజేపీ (bjp) అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) చేస్తున్న దీక్ష నేపథ్యంలో మంత్రి నిరంజన్ రెడ్డి కౌంటర్ (minister niranjan reddy) ఇచ్చారు. కేంద్రమే వరిని కొనుగోలు చేయమని చెప్పిందని ఆయన తెలిపారు. వరి కొనుగోలు చేయమని అంటే రైతులేం కావాలని కేంద్రాన్ని అడిగామని నిరంజన్ రెడ్డి చెప్పారు. దీనిపై కేంద్రాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తూనే వున్నామని.. కొన్ని పార్టీలు థర్డ్ క్లాస్ రాజకీయాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఊరూరా కొనుగోలు కేంద్రాలు పెట్టింది తెలంగాణ ప్రభుత్వమేనని మంత్రి గుర్తుచేశారు. ఒక్క హుజురాబాద్ ఎన్నిక (huzurabad bypoll) కోసం ఇంత గందరగోళమా అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.
కేంద్రం ప్రతి గింజా కొంటామనే వరకు బండి సంజయ్ దీక్ష చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. బీజేపీ ఎవరిని బద్నాం చేసేందుకు దీక్ష చేస్తోందని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. నిల్వలున్నాయి వరి ధాన్యం కొనుగోలు చేయమని కేంద్రం చెబుతోందని మంత్రి తెలిపారు. తెలంగాణలో ఈ సీజన్‌లో 63 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోందని నిరంజన్ రెడ్డి వెల్లడించారు. వరి ధాన్యం కొనుగోలుపై తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని మంత్రి స్పష్టం చేశారు. ఏ పంటనైనా కొంటామని సాయంత్రం 5 గంటలలోపు కేంద్రం నుంచి లేఖ తీసుకురావాలని నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు. లేఖ తీసుకురాకపోతే బండి సంజయ్.. కిషన్ రెడ్డి (kishan reddy) రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. తాను మాట్లాడింది తప్పయితే రాజీనామా చేయడానికి సిద్ధంగా వున్నానని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వుందని నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
Also Read:వరి వేస్తే వేటాడుతా.. సుప్రీం చెప్పినా వినను : సిద్ధిపేట కలెక్టర్ వ్యాఖ్యలపై దుమారం.. రేవంత్ ఫైర్
కాగా.. గత సంవత్సరం మాదిరిగానే ఈ వర్షాకాలం కూడా ధాన్యం సేకరణ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి Kcr ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 18న ప్రగతిభవన్ లో ధాన్యం సేకరణపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. గత సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 6545 ధాన్య సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. యధావిధిగా ఈ సంవత్సరం కూడా ఆ కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరపాలని సీఎం civil supply శాఖాధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో Farmers ఎంతమాత్రం ఆందోళన చెందవలసిన అవసరం సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ధాన్యాన్ని శుభ్రపరచుకుని తేమ శాతం లేకుండా ఎండపోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సిఎం కేసీఆర్ సూచించారు. మధ్ధతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు జరగడానికి కావలసిన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
మరోవైపు సిద్ధిపేట కలెక్టర్ (siddipet collector) వెంకట్రామిరెడ్డి (venkatrami reddy) వ్యాఖ్యలపై తెలంగాణలో (telangana) దుమారం చెలరేగుతోంది. ఈ యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం వెంకట్రామి రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, విత్తనాలు సరఫరా చేసే డీలర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ యాసంగిలో వరి విత్తనాలు అమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఒకవేళ ఎవరైన వరి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే ఒక్కొక్కరిని చెండాడుతా, వేటాడుతా.. అంటూ కలెక్టర్ వ్యాఖ్యానించారు