
జీడిమెట్ల : Jeedimetlaలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన Girl (17) అనుమానాస్పద స్థితిలో dead అవ్వడం సంచలనంగా మారింది. ఇంటి నుంచి 300 మీటర్ల దూరంలో నిర్మాణంలో ఉన్న Buildingలో రక్తపు మడుగులో పడి ఉన్నట్లు అక్కడ కాపలాదారు సోమవారం అర్ధరాత్రి గుర్తించాడు. అదే రోజు ఆమె పదిన్నర గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వచ్చింది. సుభాష్ నగర్ Pipeline roadలో బాలిక కుటుంబం నివాసం ఉంటుంది. ఆమె ఆరో తరగతి వరకు మాత్రమే చదువుకుంది. సోమవారం రాత్రి ఇంట్లో నుంచి కిరాణా దుకాణానికి వెళ్లేందుకు బయటకు వచ్చినట్లు కుటుంబీకులు చెబుతున్నారు. గడప దాటినప్పటి నుంచి ఘటన జరిగిన భవనం వరకు ఒంటరిగా వెళ్లినట్లు CCTV cameraల్లో కనిపిస్తుంది.
ఆమె ఆ భవనం లోకే ఎందుకు వెళ్ళింది అనేది పోలీసులకు అంతు చిక్కడం లేదు. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో మృతిచెందినట్లు పోలీసులు నిర్ధారించారు. అంటే ఇంటి బయట నుంచి వచ్చిన ఆ మూడు గంటలు ఏం జరిగింది? అనేది తెలియడం లేదు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు, పోలీసులు జాగిలాలతో జల్లెడ పట్టినా.. బలమైన ఆధారాలు దొరకలేదు. భవన కాపలాదారుతో పాటు, ఆమె ఇంటి పక్కన ఉన్న పలువురిని విచారించినట్లు సమాచారం. బాలిక తల్లిదండ్రులు విచారణకు సహకరించడం లేదని ఓ పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. దాని ఆధారంగా హత్య? ఆత్మహత్యా? అనేది తేలనుంది.
కాగా, ఫిబ్రవరి 15న జీడిమెట్లలో ఓ బాలిక శవమై కనిపించింది. సోమవారం రాత్రి నుండి కనిపించకుండా పోయిన ఆమె మంగళవారం తెల్లవారుజామున విగతజీవిగా కనిపించింది. ఈ ఘటన హైదరాబాదులోని జీడిమెట్ల ప్రాంతంలో కలకలం సృష్టించింది. హైదరాబాదులోని పారిశ్రామికవాడ జీడిమెట్ల సుభాష్ నగర్ లో 17 ఏళ్ల బాలిక కుటుంబంతో కలిసి నివాసం ఉండేది. అయితే సోమవారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు.
రాత్రంతా వెతకగా మంగళవారం తెల్లవారుజామున జీడిమెట్లలోని పైప్లైన్ రోడ్డు లో బాలిక మృతదేహం లభించింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో బాలిక మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువతి మృతదేహాన్ని చూస్తే అత్యాచారం చేసి.. ఆ తర్వాత హత్య చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి బాలిక ఎవరితో కలిసి వెళ్ళింది? అనేది తెలుసుకునేందుకు ఇంటి వద్ద, ఘటన జరిగిన భవనానికి సమీపంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. బాలికను అంత దారుణంగా చంపడానికి కారణాలు నిందితుల అరెస్ట్ తోనే తేలుతుందని చెబుతున్నారు.