కుటుంబంపై కత్తులతో దాడి: వరంగల్ లో ముగ్గురి దారుణ హత్య

By telugu team  |  First Published Sep 1, 2021, 6:52 AM IST

వరంగల్ లో ముగ్గురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఓ వ్యక్తి చాంద్ పాషా అనే వ్యక్తి కుటుంబంపై కత్తులతో దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురు మరణించగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.


వరంగల్: తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లో దారుణమైన సంఘటన జరిగింది. ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి ముగ్గురిని హత్య చేశాడు. బుధవారం తెల్లవారా జామును ఈ హత్యాఘటన చోటు చేసుకుంది. 

వరంగల్ లోని ఎల్బీనగర్ కు చెందిన చాంద్ పాషా కుటుంబ సభ్యులపై తమ్ముడు షఫీ కత్తులతో దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 

Latest Videos

మృతులను చాంద్ పాషా, ఖలీల్, సమీరాలుగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. 

చాంద్ పాషా, షఫీల మధ్య పశువుల వ్యాపారంలోని వ్యవహారాలే ఈ హత్యలకు దారి తీసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

click me!