విచారణకు వస్తారా.. అరెస్ట్ వారెంట్ జారీ చేయాలా: అక్బరుద్దీన్‌కు నాంపల్లి కోర్ట్ హెచ్చరిక

Siva Kodati |  
Published : Aug 31, 2021, 10:20 PM IST
విచారణకు వస్తారా.. అరెస్ట్ వారెంట్ జారీ చేయాలా: అక్బరుద్దీన్‌కు నాంపల్లి కోర్ట్ హెచ్చరిక

సారాంశం

ఎంఐఎం అగ్రనేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీకి నాంపల్లి కోర్ట్ షాకిచ్చింది. 2012 నాటి నిర్మల్ కేసులో తమ ఎదుట హాజరవ్వాలని లేనిపక్షంలో అరెస్టు వారెంట్ జారీ చేస్తామని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు  

ఎంఐఎం అగ్రనేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీకి నాంపల్లి కోర్ట్ షాకిచ్చింది. 2012 నాటి నిర్మల్ కేసులో తమ ఎదుట హాజరవ్వాలని లేనిపక్షంలో అరెస్టు వారెంట్ జారీ చేస్తామని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 2012లో నిర్మల్ బహిరంగ సభలో హిందువుల పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో న్యాయవాది కరుణా సాగర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పై కేసు పెట్టారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సెప్టెంబర్ 1న నాంపల్లి ఎంపీ,ఎమ్మెల్యే కోర్టుకు అక్బరుద్దీన్ ఓవైసీ హాజరు కావాలని కోర్ట్ ఆదేశించింది. అయితే నిర్మల్‌లో అక్బరుద్దీన్‌పై నమోదైన కేసును ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ చేశారు. దీనిలో భాగంగానే కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి