నిజామాబాద్‌లో కిడ్నాప్ కలకలం:; యువకుడిని కొట్టి కారులో తీసుకెళ్లిన ముగ్గురు

Published : Dec 28, 2022, 04:34 PM IST
నిజామాబాద్‌లో కిడ్నాప్ కలకలం:; యువకుడిని కొట్టి  కారులో  తీసుకెళ్లిన ముగ్గురు

సారాంశం

నిజామాబాద్ పట్టణంలోని  పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్స్ లో  ఉన్న  యువకుడిని  ముగ్గురు వ్యక్తులు  కారులో కిడ్నాప్  చేశారు.  కారు బోధన్ వైపునకు వెళ్లినట్టుగా  పోలీసులు అనుమానిస్తున్నారు.

నిజామాబాద్: నిజామాబాద్ పట్టణంలోని పాలిటెక్నిక్  కాలేజీ గ్రౌండ్స్ లో   ఓ యువకుడిని  చితకబాది  ముగ్గురు వ్యక్తులు  కారులో తీసుకెళ్లారు.  పాలిటెక్నిక్  కాలేజీ గ్రౌండ్స్ లో  ఫోన్ లో మాట్లాడుతున్న వ్యక్తిని కారులో  వచ్చిన ముగ్గురు వ్యక్తులు చితకబాదారు. అతడిని  వెంటనే కారులో తీసుకెళ్లారు.  ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు  తమ సెల్ ఫోన్లలో  రికార్డు చేశారు.  యువకుడిని కిడ్నాప్  చేసిన కారు  నెంబర్ టీఎస్  29 సీ6688 గా పోలీసులు గుర్తించారు. ఈ కారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ కు చెందిన బాగయ్య యాదవ్ పేరుతో రిజిస్ట్రేషన్  చేసి ఉంది.

రవాణా శాఖ కార్యాలయంలో  ఉన్న చిరునామా ఆధారంగా  పోలీసులు బాగయ్య యాదవ్ ను ఈ విషయమై పోలీసులు సంప్రదించారు.  తన కారును ఇవాళ ఉదయం  తన అల్లుడు అఖిలేష్ యాదవ్ తీసుకెళ్లినట్టుగా బాగయ్య యాదవ్ పోలీసులకు చెప్పారు. పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్స్ లో  కొట్టి తీసుకెళ్లిన యువకుడిని  రైతు బజార్,  బైపాస్ రోడ్డు మీదుగా బోధన్ వైపునకు తీసుకెళ్తున్నట్టుగా  పోలీసులు గుర్తించారు. ఈ విషయమై  బోధన్ పోలీసులకు కూడా  నిజామాబాద్ పోలీసులు సమాచారం ఇచ్చారు. బోధన్ పోలీసులు బాగయ్య యాదవ్  ను ఈ విషయమై  సమాచారం సేకరిస్తున్నారు. కిడ్నాప్ నకు గురైన యువకుడు ఎవరు,  కిడ్నాప్ చేసిన వారెవరనే విషయమై  పోలీసులు ఆరా తీస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే