పద్మశ్రీ అవార్డు..సునీల్ ఛెత్రీ సికింద్రాబాద్ వాడే..

By ramya neerukondaFirst Published Jan 26, 2019, 10:46 AM IST
Highlights

విభిన్న రంగాల్లో సేవలు అందించిన వారికి భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం పద్మా పురస్కరాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. 

విభిన్న రంగాల్లో సేవలు అందించిన వారికి భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం పద్మా పురస్కరాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు ప్రముఖులు పద్మశ్రీ అవార్డును అందుకోనున్నారు. వారిలో  ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారులు సునీల్ ఛెత్రీ ఒకరు.

ఫుట్ బాల్ క్రికెటర్ సునీల్ ఛెత్రీ అందరికీ సుపరిచితుడే. కానీ.. సునీల్ సికింద్రాబాద్ వాసి అన్న విషయం చాలా తక్కువ మందికి తెలిసు. సునీల్ పుట్టింది.  సికింద్రాబాద్ లోనే. ఆ తర్వాత అతని తండ్రి వృత్తిరిత్యా వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. తనకు పదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే సునీల్ ఫుట్ బాల్ ఆడటం మొదలుపెట్టాడు.

కెప్టెన్ ఫెంటాస్టిక్ గా పేరు పొందాడు.  ఇండియన్ నేషనల్ టీం, బెంగళూరు ఎఫ్ సీ జట్లకు న్యాయకత్వం వహించాడు. ఫుట్‌బాల్‌లో మరే క్రీడాకారుడికీ సాధ్యం కాని ఘనతలందుకున్న ఆటగాడు సునీల్‌ ఛెత్రి. వంద అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడు ఛెత్రినే. ఎక్కువ మ్యాచ్‌లు ఆడటమే కాదు ఏకంగా 67 గోల్స్‌ కూడా సాధించాడు. ప్రస్తుతం ఫుట్‌బాల్‌లో కొనసాగుతున్న క్రీడాకారుల్లో క్రిస్టియానో రొనాల్డో తర్వాత స్థానం అతడిదే. ఇటీవలే మెస్సి ను అతను అధిగమించాడు. అందుకే అతనిని భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరిస్తోంది. 
 

click me!