పొన్నాలకు షాక్.. ఆయన ఫోటోతో శవయాత్ర

Published : Jan 26, 2019, 10:23 AM IST
పొన్నాలకు షాక్.. ఆయన ఫోటోతో శవయాత్ర

సారాంశం

టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు సొంత పార్టీ నేతల నుంచే షాక్ తగిలింది. జనగామ మండలం పెంబర్తి గ్రామంలో పొన్నాల దిష్టి బొమ్మతో కాంగ్రెస్ కార్యకర్తలు శవయాత్ర నిర్వహించారు. 

టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు సొంత పార్టీ నేతల నుంచే షాక్ తగిలింది. జనగామ మండలం పెంబర్తి గ్రామంలో పొన్నాల దిష్టి బొమ్మతో కాంగ్రెస్ కార్యకర్తలు శవయాత్ర నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి నిమ్మతి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పొన్నాల హటావో.. కాంగ్రెస్ బచావో అంటూ  నినాదాలు చేశారు.

ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో పొన్నాల కారణంగానే పెంబర్తిలో కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్ గా ఎన్నిక కాలేదని ఈ సందర్భంగా వారు ఆరోపించారు. పొన్నాల.. తన స్వార్థం కోసం కార్యకర్తలను పట్టించుకోకుండా పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో సొంత పార్టీ సర్పంచ్ అభ్యర్థుల ఓటమి కారకుడయ్యాడని మండిపడ్డారు.

పార్టీ బలపరచిన అభ్యర్థిని కాదని.. స్వంతత్ర అభ్యర్థికి ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నాడని విమర్శించారు. ఈ విషయంలో.. పొన్నాలపై పార్టీ అధిష్టానికి ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!