బట్టలు ఉతుకుతూ నీటి గుంటలో పడి ముగ్గురు మృతి

Siva Kodati |  
Published : Jun 02, 2019, 04:04 PM IST
బట్టలు ఉతుకుతూ నీటి గుంటలో పడి ముగ్గురు మృతి

సారాంశం

మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నీటి గుంటలో పడి ముగ్గురు మరణించారు.

మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నీటి గుంటలో పడి ముగ్గురు మరణించారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం.. కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలోని బాలయ్య నగర్‌లోని బంధువుల ఇంట్లో వివాహానికి వచ్చింది.

ఈ క్రమంలో ఆదివారం ఉదయం స్థానికంగా ఉన్న క్వారీ వద్ద నీటి గుంతలో దుస్తులు ఉతుకేందుకు వెళ్ళారు. ఈ సమయంలో ముగ్గురు అదుపు తప్పి క్వారీలో పడి మరణించారు. మృతులను ఐలమ్మ (65), అనిత (30), యశ్వంత్‌ (10) గా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ