ముగ్గురు పిల్లలకు ఉరేసి ఆత్మహత్య చేసుకొన్న తల్లి: ప్రాణాపాయం నుండి బయటపడిన చిన్న కూతురు

Published : Jul 08, 2021, 09:23 AM IST
ముగ్గురు పిల్లలకు ఉరేసి ఆత్మహత్య చేసుకొన్న తల్లి: ప్రాణాపాయం నుండి బయటపడిన చిన్న కూతురు

సారాంశం

ముగ్గురు పిల్లలకు ఉరేసి ఆత్మహత్య చేసుకొంది తల్లి. ఉరేసుకోొవడం కోసం బిగించిన చీర ముడి వీడడంతో చిన్న కూతురు ప్రాణాపాయం నుండి బయటపడింది. తల్లి సహా ఇద్దరు పిల్లలు మరణించారు. ఈ ఘటన చౌటుప్పలల్ లో చోటు చేసుకొంది.


చౌటుప్పల్: ఆర్ధిక ఇబ్బందులతో పిల్లలకు ఉరివేసి వివాహిత  ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటన యాదాద్రి భువనగరి జిల్లాలోని చౌటుప్పల్ మండలకేంద్రంలో చోటు చేసుకొంది. చౌటుప్పల్  మండలకేంద్రంలోని రామ్‌నగర్ కు చెందిన వెంకటేష్, రాణి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. భర్త మద్యానికి బానిసగా మారాడు.  ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు చోటు చేసుకొన్నాయి. 

 మద్యం మానివేయాలని చాలా రోజులుగా ఆమె భర్తకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కానీ  భర్త వెంకటేష్ మాత్రం మద్యం మానలేదు.ఇదే సమయంలో ఆర్ధికంగా  ఈ కుటుంబం చితికిపోయింది. దీంతో కుంగిపోయిన రాణి ఆత్మహత్య చేసుకోవాలని భావించింది.

బుధవారం నాడు రాత్రి  తన ముగ్గురు చిన్న పిల్లలలకు ఉరివేసి, తాను ఆత్మహత్య చేసుకొంది.  ఇద్దరు కూతుళ్లు  లక్కీ, హర్షిణి ప్రాణాలు కోల్పోయారు. ఉరి వేసిన చీర ముడి వీడడంతో  చిన్న కూతురు ప్రాణపాయం నుండి తప్పించుకొంది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో విషాదం నెలకొంది. ఈ విషయమైపోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?