లవర్ మాట్లాడటం లేదని.. ఆన్ లైన్ లో కత్తి కొని..!

Published : Jul 08, 2021, 08:40 AM IST
లవర్ మాట్లాడటం లేదని.. ఆన్ లైన్ లో కత్తి కొని..!

సారాంశం

కొద్ది రోజులుగా ఆమెను కలవాలంటూ అతను కోరుతున్నాడు. ఈ ఖ్రమంలో.. మంగళవారం అర్థరాత్రి 12గంటలకు ఫోన్ చేసి ఆ యువతి ఇంటికి వెళ్లాడు. 

జూబ్లీహిల్స్.. వారిద్దరూ దాదాపు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటూనే ఉన్నారు. ఇటీవల వారి మధ్య ఏవో చిన్న చిన్న మనస్పర్థలు వచ్చాయి. దీంతో.. ఆమె అతనితో మాట్లాడటం మానేసింది. దీంతో.. ఆమెపై కోపంతో ఊగిపోయాడు. ఈ క్రమంలో మాట్లాడతానంటూ రాత్రివేళ యువతి వద్దకు కత్తి తీసుకొని వచ్చాడు. ఆమె అప్రమత్తమై 100 నంబర్ కి ఫోన్ చేసింది. నిమిషాల్లో అక్కడకు చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసి.. యువతిని కాపాడారు. ఈ సంఘటన జూబ్లీహిల్స్ పరిధిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బోరబండ సమీపంలోని బంజారానగర్ లో నివసించే బండారి శ్రీకాంత్(25) నాలుగేళ్ల కిందట ఎన్ఎస్బీ నగర్ లో ఉండేవాడు. ఓ స్టార్ హోటల్ జిమ్ లో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న యువతి(23) తో పరిచయం ఏర్పడింది. తర్వాత వీరి మధ్య గొడవలు జరగడంతో.. 2020 అక్టోబర్ లో యువతి ఫిర్యాదుతో మాదాపూర్ పోలీసు స్టేషన్ లో శ్రీకాంత్ పై కేసు నమోదైంది.

కొద్ది రోజులుగా ఆమెను కలవాలంటూ అతను కోరుతున్నాడు. ఈ ఖ్రమంలో.. మంగళవారం అర్థరాత్రి 12గంటలకు ఫోన్ చేసి ఆ యువతి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో యువతి, ఆమె సోదరి ఉన్నారు. కూర్చొని మాట్లాడుతుండగా.. అతని వెనుక భాగంలో కత్తి ఉన్నట్లు యువతి సోదరి గుర్తించింది.

వెంటనే ఆమె పోలీసులకు ఫోన్ చేసింది. వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. యువకుడిని తనిఖీ చేయగా..కత్తి కనిపించింది. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ కత్తిని అతను ఆన్ లైన్ లో కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?