కొమరంభీమ్ జిల్లాలో విషాదం: ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

Published : Nov 13, 2020, 12:32 PM ISTUpdated : Nov 13, 2020, 01:06 PM IST
కొమరంభీమ్ జిల్లాలో  విషాదం: ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

సారాంశం

కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో శుక్రవారం నాడు విషాదం చోటు చేసుకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకొన్నారు.  


ఆసిఫాబాద్: కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో శుక్రవారం నాడు విషాదం చోటు చేసుకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకొన్నారు.

జిల్లాలోని చింతలమానపల్లి మండలం బూరపల్లిలో విషాదం చోటు చేసుకొంది. ప్రాణహిత నదిలో భార్య, కూతురు ఆత్మహత్య చేసుకొంది. ఈ విషయం తెలుసుకొన్న భర్త కూడ ఇదే నదిలో దూకి ఆత్మహత్య చేసుకొన్నాడు.

ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ విషయం తెలిసిన మృతుల బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ముగ్గురు ఆత్మహత్య చేసుకొన్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఏ విషయమై గొడవ జరిగిందనే విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు.

మృతదేహాల కోసం ప్రాణహిత నదిలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాలను దొరికిన వెంటనే పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు పోలీసులు.

PREV
click me!

Recommended Stories

వేగంగా మారుతోన్న తెలంగాణ రాజ‌కీయం.. మిషన్ కొండా సురేఖ మొదలైందా.?
ట్రంప్ మెచ్చిన తెలుగు మహిళ.. US పాలిటిక్స్ లో సంచలనం | Saritha Komatireddy | Donald Trump