విమానంలో.. ఊపిరాడక 11నెలల చిన్నారి మృతి

Published : Sep 26, 2018, 10:54 AM IST
విమానంలో.. ఊపిరాడక 11నెలల చిన్నారి మృతి

సారాంశం

అమెరికా నుంచి హైదరాబాద్‌ వస్తున్న విమానంలో 11 నెలల శిశువు ఊపిరాడక తెగ ఇబ్బందిపడింది. అయితే విమాన సిబ్బంది ఆ పసికందును కాపాడటానికి  విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికి సఫలం కాలేదు. 

విమానంలో ఊపిరాడక 11నెలల చిన్నారి కన్నుమూసిన హృదయవిదారక సంఘటన హైదరాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...అమెరికా నుంచి హైదరాబాద్‌ వస్తున్న విమానంలో 11 నెలల శిశువు ఊపిరాడక తెగ ఇబ్బందిపడింది. అయితే విమాన సిబ్బంది ఆ పసికందును కాపాడటానికి  విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికి సఫలం కాలేదు. 

అయితే ముందస్తుగా హైదరాబాద్‌ విమానాశ్రయంలో డాక్టర్‌ను, అంబులెన్స్‌ను సిద్దం చేశారు. లాండింగ్‌ అయిన వెంటనే హుటాహుటినా స్థానిక అపోలో మెడికల్‌ సెంటర్‌కు తరలించారు. కానీ అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు నిర్దారించిన వైద్యులు.. శ్వాస ఆడకనే చనిపోయినట్లు తెలిపారు. శిశువు మృతి పట్ల విమాన సంస్థ, సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. మరింత సమాచారం తెలియాల్సివుంది. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌