నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Published : Dec 10, 2022, 11:36 AM IST
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

సారాంశం

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేపూరు గ్రామ శివారులో జాతీయ రహదారిపై లారీని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. 

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేపూరు గ్రామ శివారులో జాతీయ రహదారిపై లారీని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.  మరో వృద్ధుడు గాయపడ్డారు. మృతిచెందినవారిని నందిపేట్ మండల కేంద్రానికి చెందిన అశోక్, మోహన్, రమేష్‌లుగా గుర్తించారు. మృతులు జగిత్యాల జిల్లాలోకి కొండగట్టుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. కారు తీవ్రంగా దెబ్బతినడంతో క్రేన్‌ సాయంతో మృతులను కారులో నుంచి వెలికితీశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 

PREV
click me!

Recommended Stories

మీకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? మీకో బ్యాడ్ న్యూస్‌, క్యాష్‌లెస్ చికిత్స‌ల‌కు తాత్కాలిక్ బ్రేక్
కొత్త ఇంటికి కరెంట్ మీట‌ర్ ఎలా తీసుకోవాలి? అవసరమైన పత్రాలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు