భద్రాచలంలో బూజు పట్టిన లడ్డూలు.. భక్తుల వినూత్న నిరసన

Siva Kodati |  
Published : Jan 08, 2023, 02:35 PM IST
భద్రాచలంలో బూజు పట్టిన లడ్డూలు.. భక్తుల వినూత్న నిరసన

సారాంశం

ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం రామాలయంలో బూజు పట్టిన లడ్డూలు రావడం కలకలం రేపింది. దీనిపై భక్తులు వినూత్నంగా నిరసన తెలియజేశారు.   

ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం రామాలయంలో బూజు పట్టిన లడ్డూలు రావడం కలకలం రేపింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు.. వినూత్నంగా నిరసన తెలిపారు. ఇక్కడ బూజుపట్టిన లడ్డూలు అమ్మబడును అని పేపర్‌పై రాసి అతికించారు. లడ్డూల నాణ్యతను అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.

కాగా.. ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో సీతారాములను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇదే సమయంలో 2 లక్షల లడ్డూలను ఆలయ అధికారులు తయారు చేయించారు. పండుగ పూర్తయిన తర్వాత మిగిలిన ప్రసాదాన్ని నిల్వ చేసే విషయంలో ఆలయ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో లడ్డూలకు బూజు పట్టింది. అయినప్పటికీ వాటిని అలాగే విక్రయిస్తూ వుండటంతో భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?