సిగరెట్టు షేరింగ్ వల్ల ముగ్గురికి కరోనా వైరస్ వ్యాధి సోకింది. తెలంగాణలోని షాద్ నగర్ లో అంత్యక్రియలకు హాజరైన ముగ్గురు మిత్రులు ఒక్క సిగరెట్టును ముగ్గురు షేర్ చేసుకున్నారు. దీంతో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది.
హైదరాబాద్: సిగరెట్టు షేరింగ్ షాద్ నగర్ లో కొంప ముంచింది. సిగరెట్టు షేరింగ్ వల్ల తెలంగాణలోని షాద్ నగర్ లో ముగ్గురికి కరోనా వైరస్ సోకింది. షాద్ నగర్ లో ఓ వ్యక్తి అంత్యక్రియలకు హాజరైన ముగ్గురు యువకులు ఒక్కటే సిగరెట్ ను షేర్ చేసుకున్నారు. దాంతో ముగ్గురికి కరోనా వైరస్ సోకింది.
కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన హైదరాబాదులోని జియాగుడాకు చెందిన ఓ యువకుడు షాద్ నగర్ లో అంత్యక్రియలకు హాజరయ్యాడు. అక్కడ అతను మిగతా ఇద్దరితో సిగరెట్ షేర్ చేసుకున్నాడు. అదే కొంప ముంచింది. పైగా, కరోనా వైరస్ పాజిటివ్ ఉన్న యువకుడు కారులో షాద్ నగర్ వరకు వెళ్లాడు.
undefined
షాద్ నగర్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏడుకు చేరుకుంది. కరోనా వైరస్ పాజిటివ్ ఉన్న వ్యక్తి జియాగుడా నుంచి షాద్ నగర్ కారులో ఎలా వెళ్లాడనే విషయంపై అరా తీస్తున్నారు. అధికారులు అప్రమత్తంగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Also Read: తెలంగాణలో 2 వేలు దాటిన కరోనా కేసులు: జీహెచ్ఎంసీలో కొనసాగుతున్న జోరు
లాక్ డౌన్ సడలించిన నేపథ్యంలో తెలంగాణ కరోనా వైరస్ వ్యాప్తి పెరిగింది. హైదరాబాదులో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేలు దాటింది. బుధవారం కొత్తగా 109 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరుగురు కోవిడ్ -19తో మృత్యువాత పడ్డారు. ఈ స్థితిలో షాద్ నగర్ ఘటన ఆందోళనకు గురి చేస్తోంది.