డ్యూటీని పక్కనబెట్టి క్యాట్ వాక్.. ముగ్గురి ఉద్యోగాలు ఉఫ్

Siva Kodati |  
Published : Jul 27, 2019, 06:24 PM IST
డ్యూటీని పక్కనబెట్టి క్యాట్ వాక్.. ముగ్గురి ఉద్యోగాలు ఉఫ్

సారాంశం

డ్యూటీని పక్కనబెట్టి టిక్ టాక్ వీడియోలు చేసిన ముగ్గురు మహిళా ఉద్యోగులను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సస్పెండ్ చేసింది

డ్యూటీని పక్కనబెట్టి టిక్ టాక్ వీడియోలు చేసిన ముగ్గురు మహిళా ఉద్యోగులను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సస్పెండ్ చేసింది. కరీంనగర్ వైద్య ఆరోగ్యశాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న దివ్యమణి, సమత, ల్యాబ్ అసిస్టెంట్ జయలక్ష్మీ విధులు పక్కనబెట్టి.. టిక్‌టాక్‌లో నటించారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ప్రభుత్వోద్యోగులకు ఉండి క్రమశిక్షణ తప్పడంతో ముగ్గురిపై వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఈ ముగ్గురు యువతులు కారుణ్య నియామకాల్లో భాగంగా ఉద్యోగం పొందిన వారు కావడం గమనార్హం. కాగా.. విధులు పక్కనబెట్టి టిక్‌టాక్‌లో నటించిన సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్య విద్యార్ధులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!