కవిత ఓటమికి కారణం ఎవరో చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి: అంతా కేసీఆర్ చేతుల్లోనే..

By Nagaraju penumalaFirst Published Jul 27, 2019, 3:41 PM IST
Highlights

 ఇకపోతే సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా మరోసారి పోటీ చేశారు కల్వకుంట్ల కవిత. రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ తరపున బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ కవితపై 68వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.   

జగిత్యాల : టీఆర్ఎస్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నిజామాబాద్ ఎంపీగా కవిత గెలిచి ఉంటే అంతో ఇంతో అభివృద్ధి జరిగేదని చెప్పుకొచ్చారు. 

జగిత్యాల నియోజకవర్గంలో వాడవాడలా కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న జీవన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న అంతర్గత పోరే ఆమె ఓటమికి కారణమంటూ చెప్పుకొచ్చారు.  నిజామాబాద్ ఎంపీగా కవిత గెలిచుంటే అంతో ఇంతో అభివృద్ధి జరిగేదని స్పష్టం చేశారు. 

టీఆర్ఎస్ నేతలకు తెలివి లేదని తెలివి ఉంటే కవితను ఓడిస్తారా అంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్‌లో గ్రూపుల కుమ్ములాటలు కవితను ఓడించాయని తెలిపారు. ఆమెకు అన్యాయం చేసింది సొంత పార్టీ నేతలేనని మరెవరో కాదన్నారు. 

మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ పంద్రాగష్టు లోపు పథకాల అమలు మీద స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ పోరాటబాట పడుతుందని హెచ్చరించారు. కవిత ఓటమిపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

click me!