వికారాబాద్ జిల్లాలోని కోటి పల్లి ప్రాజెక్టులో సోమవారం నాడు నలుగురు మృతి చెందారు. ఈతకు వెళ్లిన ఒకరిని కాపాడేందుకు వెళ్లిన మరో ముగ్గురు మృతి చెందారు.
హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలోని కోటి పల్లి ప్రాజెక్టులో సోమవారంనాడు గల్లంతై నలుగురు మృతి చెందారు..మృతులంతా మన్నెగూడకు చెందినవారిగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా పోలీసులు చెప్పారు. మన్నెగూడకు చెందిన లోకేష్, వెంకటేష్, జగదీష్, రాజేష్ లు కోటిపల్లి రిజర్వాయర్ వద్దకు విహారయాత్రకు వచ్చారు. విహారయాత్రకు వచ్చిన నలుగురిలో ఒకరు ఈత కొడుతూ గల్లంతయ్యారు. అతనిని కాపాడేందుకు మరో ముగ్గురు వెళ్లారు. ఈ నలుగురు ఈ రిజర్వాయర్ లో గల్లంతై మృతి చెందారు. నాలుగు మృతదేహలను వెలికితీశారు.మన్నెగూడకు చెందిన
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం దురదృష్టకరమని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఆర్ధిక సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఆనంద్ చెప్పారు.మృతదేహలను పోస్టుమార్టం కోసం వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.మృతదేహలను పోస్టుమార్టం కోసం వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.పోస్టుమార్టం తర్వాత మృతదేహలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.