Rahul Gandhi Telangana tour: దామోదరం సంజీవయ్యకు నివాళులర్పించిన రాహుల్ గాంధీ

Published : May 07, 2022, 12:58 PM ISTUpdated : May 07, 2022, 02:02 PM IST
Rahul Gandhi Telangana tour: దామోదరం సంజీవయ్యకు నివాళులర్పించిన రాహుల్ గాంధీ

సారాంశం

తెలంగాణ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితం సంజీవయ్య పార్క్ వద్దకు చేరుకున్నారు. అక్కడ దివంగత మాజీ సీఎం దామోదరం సంజీవయ్య సమాధి వద్ద నివాళులర్పించారు.

తెలంగాణ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితం సంజీవయ్య పార్క్ వద్దకు చేరుకున్నారు. అక్కడ దివంగత మాజీ సీఎం దామోదరం సంజీవయ్య సమాధి వద్ద నివాళులర్పించారు. రాహుల్ గాంధీ వెంట టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వీహెచ్, మల్లు భట్టివిక్రమార్క.. ఇతర సీనియర్ నాయకులు ఉన్నారు. ఇక, రాహుల్ గాంధీని చూసేందుకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు సంజీవయ్య పార్క్ వద్దకు చేరుకన్నారు. అయితే పాస్‌లు ఉన్నవారిని మాత్రమే సంజీవయ్య పార్క్ లోనికి అనుమతించారు.  

ఇక, సంజీవయ్య పార్క్ నుంచి రాహుల్ గాంధీ.. చంచల్ గూడ జైలుకు వెళ్లనున్నారు. అక్కడ రిమాండ్‌లో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తో పాటు 18 మంది యూత్ కాంగ్రెస్ నాయకులను రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. రాహుల్‌తో పాటు జైలులోకి వెళ్లేందుకు మరోకరిని మాత్రమే జైళ్ల శాఖ అనుమతించింది. ఇక, రాహుల్ రాక నేపథ్యంలో చంచల్‌గూడ జైలు వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు సాధారణ ములఖాత్‌లు నిలిపివేశారు. మరోవైపు రాహుల్ చంచల్‌గూడ జైలుకు వస్తున్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. 

చంచల్ గూడ జైలులో ఎన్‌ఎస్‌యూఐ నాయకులను పరామర్శించిన అనంతరం రాహుల్.. గాంధీ భవన్ చేరుకుంటారు. గాంధీభవన్ లో పార్టీ extended మీటింగ్ లో పాల్గొంటారు. పార్టీ మెంబర్ షిప్ కో ఆర్డినేతలతో ఫోటోలు దిగుతారు. ఈ  కార్య‌క్ర‌మం అనంత‌రం గాంధీ భవన్ నుంచి బైరోడ్ ద్వారా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 5:50 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ వెళ్తారు. 

 

ఇక, నిన్న వరంగల్ రైతు సంఘర్షణ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్ చేరుకున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో రాహుల్ బస చేశారు. ఈ రోజు ఉదయం రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి ఆయన అల్పాహారం చేశారు. అనంతరం పలు మీడియా సంస్థల అధిపతులు, మేధావులు, తెలంగాణ ఉద్యమకారులతో హోటల్‌లోనే ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. చెరుకు సుధాకర్, కంచె ఐలయ్య, గద్దర్, హరగోపాల్‌లతో విడివిడిగా రాహుల్ సమావేశయ్యారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి.. సంజీవయ్య పార్క్‌కు చేరుకున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu