కిడ్నాప్ కోసం తాత్కాలిక సిమ్ వాడిన అఖిలప్రియ: సీపీ అంజనీకుమార్

By narsimha lodeFirst Published Jan 11, 2021, 3:21 PM IST
Highlights

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్టుగా హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ చెప్పారు. ఈ కిడ్నాప్ కోసం ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తాత్కాలిక సిమ్ కార్డు ఉపయోగించారని ఆయన తెలిపారు. 
 

హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్టుగా హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ చెప్పారు. ఈ కిడ్నాప్ కోసం ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తాత్కాలిక సిమ్ కార్డు ఉపయోగించారని ఆయన తెలిపారు. 

సోమవారం నాడు మధ్యాహ్నం తన కార్యాలయంలో హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ మీడియాతో మాట్లాడారు. బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో నిందితులు ఉపయోగించిన మూడు మొబైల్ ఫోన్లు, ఫేక్ నెంబర్ ప్లేట్లను కూడ స్వాధీనం చేసుకొన్నామని ఆయన చెప్పారు.

ఈ కిడ్నాప్  కోసం నిందితులు ప్రత్యేకంగా ఆరు సిమ్ కార్డులను వాడినట్టుగా పోలీసులు గుర్తించారు. హైద్రాబాద్ మియాపూర్ లోని ఎస్ కే మొబైల్ షాపు నుండి ఈ సిమ్ కార్డులను స్వాధీనం చేసుకొన్నారని ఆయన చెప్పారు.

ఈ సిమ్ కార్డుల  కోసం  భూమమా అఖిలప్రియ అనుచరుడు మల్లిఖార్జున్ రెడ్డి బయోమెట్రిక్ తో పాటు ఇతర ఆధారాలను కూడ అందించినట్టుగా చెప్పారు. ఈ కిడ్నాప్ కోసమే ఈ నెంబర్లు తీసుకొన్నారని విచారణలో తేలిందని ఆయన చెప్పారు.

మల్లిఖార్జున్ రెడ్డి, సంపత్ కుమార్ , అఖిలప్రియ పీఏ బాల చెన్నయ్యలను అరెస్ట్ చేశామని సీపీ తెలిపారు. ఈ కొత్త సిమ్ కార్డుల్లో భూమా అఖిలప్రియ 7095637583 నెంబర్ ను ఉపయోగించినట్టుగా  చెప్పారు.

ప్రవీణ్ రావును కిడ్నాప్ చేయడానికి ముందు బాధితుల ఇంటిని దుండగులు రెక్కీ చేశారని సీపీ వివరించారు. ఈ కిడ్నాప్ కేసులో నిందితులు ఉపయోగించిన సెల్ ఫోన్ల లోకేషన్ల ఆధారాలను కూడ సేకరించామని ఆయన తెలిపారు.

also read:బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు: అఖిలప్రియే కీలక సూత్రధారి, కాల్ రికార్డ్స్ సేకరించిన పోలీసులు

కిడ్నాప్ జరుగుతున్నంత సేపు ఇతర కిడ్నాపర్లతో మరో కిడ్నాపర్ గుంటూరు శ్రీనివాస్ మాట్లాడుతూనే ఉన్నాడని సీపీ చెప్పాడు. 

కిడ్నాప్ నకు సంబంధించి 143 గంటల కాల్ డేటాను సేకరించామన్నారు. కిడ్నాప్ కేసులో మొత్తం 19 మంది ఉన్నారన్నారు. గుంటూరు శ్రీనుతో పాటు మరో నిందితుడికి మధ్య 28 కాల్స్ గుర్తించామన్నారు. గుంటూరు శ్రీనువాస్ నుండి ఇంకో నిందితుడికి మధ్య 16 కాల్స్ సంభాషణ చోటు చేసుకొందని చెప్పారు.

అఖిలప్రియ తాత్కాలిక నెంబర్ నుండి గుంటూరు శ్రీనుకు  49 కాల్స్  సంభాషణను  గుర్తించామన్నారు. లోథా అపార్ట్‌మెంట్ కేంద్రంగా కిడ్నాప్  ప్లాన్ జరిగిందని సీపీ తెలిపారు.ఈ కిడ్నాప్ వెనుక అఖిలప్రియ ఉన్నట్టుగా అన్ని సాక్ష్యాలను సేకరించామని సీపీ తెలిపారు.

click me!