బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు: అఖిలప్రియే కీలక సూత్రధారి, కాల్ రికార్డ్స్ సేకరించిన పోలీసులు

By narsimha lodeFirst Published Jan 11, 2021, 2:38 PM IST
Highlights

బోయిన‌పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆమెతో పాటు భార్గవరామ్ పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కీలక ఆధారాలను సేకరించారు.

హైదరాబాద్: బోయిన‌పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆమెతో పాటు భార్గవరామ్ పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కీలక ఆధారాలను సేకరించారు.

గత వారం బోయిన్‌పల్లిలో ప్రవీణ్ రావుతో పాటు అతని సోదరులను కిడ్నాప్ చేశారు.ఈ కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. ఈ కిడ్నాప్ వెనుక మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హస్తం ఉందని పోలీసులు గుర్తించారు.

అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవరామ్ పాత్రపై పూర్తి ఆధారాలను పోలీసులు సేకరించారు. కిడ్నాప్‌ సమయంలో కిడ్నాపర్లు అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ రామ్ తో మాట్లాడిన కాల్ రికార్డ్స్ ను కూడా పోలీసులు సేకరించినట్టుగా సమాచారం.

కిడ్నాప్‌నకు ఉపయోగించిన సెల్‌ఫోన్, సిమ్ కార్డులను కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. అఖిలప్రియ మాట్లాడిన ఆడియో రికార్డులను కూడ బయటపెడతామని పోలీసులు చెబుతున్నారు.

ఈ కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టై జైల్లో ఉంది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. అఖిలప్రియకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆరోపించారు.
 

click me!