మోహన్ బాబుకి బెదిరింపు కాల్స్, కేసు నమోదు

Published : Apr 03, 2019, 04:31 PM IST
మోహన్ బాబుకి బెదిరింపు కాల్స్, కేసు నమోదు

సారాంశం

సినీ నటుడు మోహన్ బాబుకి గత కొద్ది రోజులుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆయన ఇటీవల తన కుమారుడు మంచు విష్ణుతో కలిసి జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. 

సినీ నటుడు మోహన్ బాబుకి గత కొద్ది రోజులుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆయన ఇటీవల తన కుమారుడు మంచు విష్ణుతో కలిసి జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. కాగా.. వైసీపీలో చేరిన నాటి నుంచి ఆయనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. కాగా.. ఆయన దీనిపై పోలీసులను ఆశ్రయించారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని మోహన్ బాబు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

గత నెల 26న పలు నెంబర్ల నుండి ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రాథామిక విచారణ తరువాత ఆ కాల్స్‌ విదేశాల నుంచి వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. తదుపరి విచారణ నిమిత్తం న్యాయ సలహా కోసం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా పోలీసులు వెల్లడించారు.

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే