హైదరాబాద్‌లో బాణాసంచా కాల్చే సమయం ఇదే.. హద్దు మీరితే కఠిన చర్యలు

By sivanagaprasad kodatiFirst Published Nov 2, 2018, 7:42 AM IST
Highlights

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలు బాణాసంచా పేల్చే సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని తెలిపారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్. 

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలు బాణాసంచా పేల్చే సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని తెలిపారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల బాణాసంచా అమ్మకాలు, నిషేధంపై సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలను విడుదల చేసిందని... కోర్టు నిబంధనలకు అనుగుణంగా రాత్రి 8 నుంచి 10 గంటల మధ్యలోనే టపాసులు కాల్చాలని ఆదేశాలు జారీ చేశారు.

అనుమతించిన సమయంలో కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సూచించిన స్థాయిలోనే శబ్ధం ఉండాలని స్పష్టం చేశారు.. ఈ ఆంక్షలు ఈ నెల 6వ తేదీ ఉదయం నుంచి ఈ నెల 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంజనీకుమార్ హెచ్చరించారు.
 

 

click me!