కరీంనగర్ వీణవంక రైతు రాజిరెడ్డికి అవమానం

First Published Apr 7, 2018, 5:47 PM IST
Highlights
అన్నదాతకు మరో అవమానం

అన్నదాతకు తెలంగాణ స్వరాష్ట్రంలో అవమానాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న ఖమ్మంలో రైతులకు బేడీలేసి జైలుపాలు చేశారు. నిన్న కరీంనగర్ జిల్లా వీనవంకలో మరో రైతును అవమానించారు.
కరీంనగర్ రైతుకు జరిగిన అవమానాలపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు తాలూకు వివరాలు కింద ఉంచినం. మీరూ చదవండి.

కరీంనగర్ జిల్లా వీణవంక మండలానికి చెందిన రైతు ఈయన. ఈ రైతు పేరు రాజిరెడ్డి. తన వ్యవసాయ భూమి తమ పూర్వీకుల పేరు మీద ఉండటంతో తన పేరు మీదకి మార్చమని ఎమ్మార్వో ఆఫీసుకి పోయిండు. ఆ మండల ఎమ్మార్వో పేరు తూము రవీందర్. మార్చడానికి కేవలం యాభై వేల రూపాయలు మాత్రమే లంచం అడిగిండు. ఆ లంచం చిన్నపాటిదే అయినా ఆ రైతు ఇవ్వలేనని చెప్పిండు. పైగా లంచం తాను ఇచ్చుకోలేను కానీ.. కాళ్లు, వేళ్లు మొక్కుతానన్నాడు. దండం పెట్టిండు. ఇప్పటికే చాలాసార్లు తిరిగి అలిసిపోయినానని మోర పెట్టుకున్నడు.

ఎమ్మార్వోకు మస్త్ కోపమొచ్చింది. లంచం ఇయ్యకపోతే నీకు భూమి మార్పిడి చేయ్యను అన్నట్లు మాట్లాడిండు.  చివరికి ఆ రైతుకు కోపం కట్టలు తెంచుకుంది. అప్పుడు ఆగ్రహోదగ్రుడైండు ఆ రైతు. నువ్వు చదువుకున్నవా అసలు అధికారివేనా అని నిలదీశిండు. అలా ప్రశ్నించినందుకు ఆ రైతుపై కేసు పెట్టి అరెస్ట్ చేసి ఒకరోజంతా పోలీస్ స్టేషన్ లో ఉంచారు.

ఇది మన అధికారుల వైఖరి ఇలా ఉంటే.. ఆ అధికారికి ఒక మంత్రి అండదండలు అందించినట్లు గుసగుసలు వినబడుతున్నాయి. ఇది అన్యాయమని ప్రశ్నించిన వాడి నోరు మూయించటమేనా ప్రజాస్వామ్యం..!! ఎక్కడున్నాం మనం... ఆటవిక సామ్రాజ్యంలో బతుకుతున్నామా? అలా అయితే మనం కోట్లాడి తెచ్చిన ఈ తెలంగాణ ఎందుకు?? మనం ఈ దేశంలో బతకటం ఎందుకు?? అని రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. మరి ఇప్పటికైనా లంచం అడిగిన అధికారిపై చర్యలు తీసుకుంటారా? లేక చిన్నపాటి లంచం కూడా ఇవ్వలేకపోయిన రైతును జైలుపాలు చేస్తారా అన్నది అన్నది తేలాల్సి ఉంది.

click me!