
తెలంగాణలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో టిఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలిందని రాజకీయ పార్టీలు అంటున్నాయి. అయితే తన సస్పెన్షన్ పై వేములవాడ టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ స్పందించారు.
తనను మళ్లీ గతంలో మాదిరిగానే దొంగదెబ్బ తీశారని ఆవేదన వ్యక్తం చేశారు నా పార్టీ సహచరులకు, నా మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు నేనిచ్చే సందేశం అంటూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దానిలో పలు ఆసక్తికరమైన అంశాలను ఆయన పేర్కొన్నారు. అందులోని అంశాలివే.
నన్ను ప్రజాక్షేత్రంలో ఎదురుకోలేని శక్తులు నాపైన 7 కేసులు వేసి, నా జన్మభూమి పౌరసత్వాన్ని వివాదం చేసి రాజకీయలబ్ధి పొందడానికి 2013 లొ మాదిరిగానే మళ్లీ దొంగదెబ్బ తీశాయి. నేడు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి నాపైన వచ్చిన మొదటి దశ నిర్నయాన్ని మళ్లీ రివిజన్ ద్వారా ప్రశ్నించే హక్కును సంపూర్ణంగా వినియోగించుకుంటున్నాను. నాకు అవకాశం ఉన్నంతకాలం ప్రజలకు నా మాతృభూమికి సేవచేస్తాను.
ఏ పదవిలేనప్పుడు 1992 నుంచి 2009 వరకు 17 సంవత్సరాలు ప్రజలకు సేవచేసిన వాడిని, ఇలాంటి తాత్కాలిక, దురుద్దేశం తొ కూడిన సవాళ్లను ఎదురుకోవడానికి నాకు వేములవాడ రాజన్న మరియు మా తల్లితండ్రులు, నా ప్రాంతవాసుల ఆశిస్సులు ఎల్లప్పుడు ఉంటాయని పూర్తినమ్మకం ఉన్నది.
ఇట్లు
......మీ చెన్నమనేని రమేష్
అనే నోట్ ను చెన్నమనేని రమేష్ విడుదల చేశారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి