స్పూత్నిక్ వ్యాక్సిన్ : హైదరాబాద్ చేరుకున్న 50 లక్షల డోసులు...

By AN TeluguFirst Published Jun 1, 2021, 1:02 PM IST
Highlights

దేశంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సిన్ దిగుమతులకు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో (జీహెచ్ఏసీ) వేదికయ్యింది. రష్యాకు చెందిన స్పుత్నిక్-వి టీకాలు నేడు భారత్ కు చేరుకున్నాయి. మూడో విడతలో మరో 27.9లక్షల టీకా డోసులు దిగుమతి అయ్యాయి. 

దేశంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సిన్ దిగుమతులకు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో (జీహెచ్ఏసీ) వేదికయ్యింది. రష్యాకు చెందిన స్పుత్నిక్-వి టీకాలు నేడు భారత్ కు చేరుకున్నాయి. మూడో విడతలో మరో 27.9లక్షల టీకా డోసులు దిగుమతి అయ్యాయి. 

రష్యా నుంచి ప్రత్యేక చార్టర్డ్ ఫ్రైటర్ ఆర్ యు-9450 విమానం ఈ టీకాలు తీసుకుని మంగళవారం తెల్లవారుజామున 3.43 గంటల ప్రాంతంలో జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గోకు చేరుకుంది. 90 నిమిషాల్లో దిగుమతి ప్రక్రియ పూర్తయిన తరువాత ఈ టీకాలను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కు తరలించారు. 

స్పుత్నిక్ టీకా సరఫరాలో అతిపెద్ద దిగుమతి ఇదే. అంతకుముందు తొలి విడతలో 1.5 లక్షల టీకాలు, రెండో విడతలో 60 వేల డోసులను దిగుమతి చేసుకున్న విషయం తెలిసిందే. 

దీంతో ఇప్పటివరకు మొత్తం 30 లక్షల డోసులు భారత్ కు చేరుకున్నట్లయ్యింది. జూన్ లో మరో 50 లక్షల డోసులను పంపిస్తామని రష్యా ఇదివరకే వెల్లడించింది. జూన్ రెండో వారం నుంచి స్పుత్నిక్ వి టీకాల పంపిణీని ప్రారంభించనున్నారు. 

ఇప్పటివరకు భారత్ కు వచ్చిన కోవిడ్ వ్యాక్సిన్లలో అతిపెద్ద దిగుమతి ఇదే. భారత్ లో అతిపెద్ద వ్యాక్సిన్ దిగుమతి కేంద్రంగా జీహెచ్ఏసీ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుందని ఎయిర్ కార్గో తెలిపింది. 

రాబోయే రోజుల్లో హైదరాబాద్, చుట్టుపక్కల ఉన్న ప్రధాన ఫార్మా కంపెనీలు 3.5 బిలియన్ల డోసుల వివిధ రకాల కోవిడ్ వ్యాక్సిన్లనను ఉత్పత్పి చేయడం లేదా దిగుమతి చేసుకుంటాయని తెలిపింది. 

click me!