బ్యాంకు దోపిడీకి ప్లాన్ వేసి.. పోలీసు లాకప్‌లోకి వెళ్లినట్టు.. బ్యాంకు బయటి నుంచి తాళం వేయడంతో గిలగిల..

Published : Jan 02, 2024, 07:04 PM IST
బ్యాంకు దోపిడీకి ప్లాన్ వేసి.. పోలీసు లాకప్‌లోకి వెళ్లినట్టు.. బ్యాంకు బయటి నుంచి తాళం వేయడంతో గిలగిల..

సారాంశం

నిజామాబాద్‌లో ఓ దొంగ బ్యాంకు చోరీకి ప్లాన్ వేశాడు. బ్యాంకులోపలికి దూరాడు. కానీ, సైరన్ మోగడంతో సిబ్బందితోపాటు స్థానికులూ అలర్ట్ అయ్యారు. స్థానికులు ఆ బ్యాంకుకు బయటి నుంచి తాళం వేయడంతో దొంగ లోపలే గిలగిలలాడాడు. పోలీసులు ఆ దొంగను స్టేషన్‌కు పట్టుకెళ్లారు.  

డ్యామిట్.. కథ అడ్డం తిరిగింది అన్నట్టుగా ఆ దొంగ అనుకున్నది ఒకటైతే,  అయినది మరొక్కటి. బ్యాంకులోకి వెళ్లినట్టే వెళ్లి.. పోలీసు లాకప్‌లో ప్రత్యక్షమైనట్టుగా ఆ దొంగ పరిస్థితి మారింది. దొంగతనానికి వెళ్లగానే.. సైరన్ రావడంతో అప్రమత్తమైన స్థానికులు బ్యాంకు బయటి నుంచి తాళాలు వేశారు. దీంతో దొంగ లోపలే గిలగిలలాడిపోయాడు. పోలీసులు వచ్చి సింపుల్‌గా ఆ దొంగను స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఏం చేద్దామనుకుంటే.. ఏం జరిగిందా? అని షాక్‌కు గురవ్వడం దొంగ వంతైంది.

ఈ ఘటన నిజామాబాద్‌లో జరిగింది. ధర్పల్లి మండలంలోని దుబ్బాకలో ఇండియన్ ఒవర్సీస్ బ్యాంక్ ఉన్నది. ఈ బ్యాంక్‌ను టార్గెట్ చేసిన దొంగ సోమవారం రాత్రి అందులోకి దూరాడు. కానీ, బ్యాంకుల్లో ఉండే భద్రతా వ్యవస్థ, అలర్ట్ సిస్టమ్ గురించి బహుశా ఆ దొంగకు తెలియదేమో.. దొంగ బ్యాంకులోకి దూరిన తర్వాత ఒక్కసారిగా సైరన్ మోగింది. దీంతో బ్యాంకు సిబ్బంది అలర్ట్ అయ్యి పోలీసులకు సమాచారం చేరవేశారు. 

Also Read: Kishan Reddy:సిట్టింగ్ ఎంపీలకు టికెట్ కన్ఫామా? మందక్రిష్ణకూ టికెట్? జనసేనతో పొత్తు ఉంటదా?.. కిషన్ రెడ్డి వివరణ

స్థానికులూ చాకచక్యంగా వ్యవహరించారు. బ్యాంకులో దొంగతనానికి ఓ దొంగ వెళ్లినట్టుగా వాళ్లు గుర్తించారు. వారు ఆ దొంగను ఎదుర్కోవాలనే నిర్ణయానికి భిన్నంగా.. స్మార్ట్‌గా జస్ట్ షట్టర్‌కు లాక్ వేశారు. ఆ దొంగ బయటకు వచ్చే మార్గం మూసుకుపోయింది. ఆ దొంగ ఖంగారులో ఉండగానే పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. సునాయసంగా దొంగను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు పట్టుకెళ్లారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu