Free Bus: మేడారం స్పెషల్ బస్సుల్లో మహిళలకూ చార్జీలు!.. ప్రత్యేక సందర్భాల్లో జీరో టికెట్లు ఉండవా?

By Mahesh K  |  First Published Jan 2, 2024, 6:12 PM IST

మేడారం జాతరకు స్పెషల్ బస్సుల్లో మహిళలకూ చార్జీలు వేయనున్నట్టు తెలుస్తున్నది. మేడారం జాతరకు స్పెషల్ బస్సులను వేయాలని ఆర్టీసీ అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. మహిళలకు కేవలం పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌లలో మాత్రమే ఉచిత ప్రయాణ సదుపాయం ఉన్న సంగతి తెలిసిందే.
 


కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. తొట్టతొలిగా అమలు చేసిన హామీ మహాలక్ష్మీ పథకం. ఈ పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కోసం ఆర్టీసీకి నెలకు సుమారు రూ. 250 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం అనుకుంటున్నది. ఖజానాలో డబ్బులు నిండుకుని.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అప్పుల కుప్పగా మారిందని ఓ వైపు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నది.

ఇంతలోనే మేడారం జాతర దగ్గరకు వస్తున్నది. మేడారం జాతరకు రాష్ట్రవ్యాప్తంగా పిచ్చి క్రేజ్ ఉంటుంది. చాలా మంది ఈ జాతరకు తరలివెళ్లుతారు. అప్పుడు కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తే మరింత దెబ్బతిని పోతామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటున్నట్టు తెలుస్తున్నది. అందుకే ఈ మేడారం జాతరకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ల స్థానంలో స్పెషల్ బస్సులను నడపాలని రేవంత్ రెడ్డి సర్కారు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఇప్పుడు మహిళలకు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లలోనే ఉచిత ప్రయాణ సదుపాయాం ఉన్నది. కానీ, స్పెషల్ బస్సులకు టికెట్లు అనేది ఎప్పటి నుంచో అమల్లో ఉన్నదే. అందుకే స్పెషల్ బస్సులను మేడారం జాతరకు నడిపితే ఆ బస్సుల్లో ఎక్కే మహిళలు తప్పకుండా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే పల్లె వెలుగు, ఆర్టీసీ బస్సులను తగ్గించి స్పెషల్ బస్సులను పూర్తిస్థాయిలో నడపాలనే ఆదేశాలను రేవంత్ ప్రభుత్వం ఆర్టీసికి ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది.

Latest Videos

Also Read: Free Bus: హాస్టల్ వెళ్లడం ఇష్టంలేక 33 గంటలు బస్సుల్లోనే ప్రయాణించిన బాలిక.. చివరికి జేబీఎస్‌లో..

ఈ విషయంపై ఇప్పటికే ఆర్టీసీ అధికారులతో రవాణా శాఖ మంత్రి మాట్లాడినట్టు సమాచారం. స్పెషల్ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి లేనందున వాటినే పూర్తిస్థాయిలో మేడారం జాతరకు వినియోగించాలని ఆదేశించినట్టు కొన్ని వార్తా కథనాలు వచ్చాయి.

click me!