కేసీఆర్ కేబినెట్‌లోకి రావాలంటే ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి

By sivanagaprasad kodatiFirst Published Dec 19, 2018, 10:25 AM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కేబినెట్ విస్తరణపై దృష్టి సారించారు. ప్రమాణ స్వీకారం తర్వాత పాలనతో పాటు మంత్రివర్గ కూర్పుపైనా ఫోకస్ పెట్టిన ఆయన టీఆర్ఎస్ తరపున ఎన్నికైన 88 ఎమ్మెల్యేలతో పాటు ఫార్వార్డ్ బ్లాక్ సభ్యుడు, మరో స్వతంత్ర అభ్యర్థి పార్టీలో చేరడంతో తెరాస బలం 90కి చేరింది. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కేబినెట్ విస్తరణపై దృష్టి సారించారు. ప్రమాణ స్వీకారం తర్వాత పాలనతో పాటు మంత్రివర్గ కూర్పుపైనా ఫోకస్ పెట్టిన ఆయన టీఆర్ఎస్ తరపున ఎన్నికైన 88 ఎమ్మెల్యేలతో పాటు ఫార్వార్డ్ బ్లాక్ సభ్యుడు, మరో స్వతంత్ర అభ్యర్థి పార్టీలో చేరడంతో తెరాస బలం 90కి చేరింది.

దీంతో పాటు 30 మంది ఎమ్మెల్సీల జాబితాను తెప్పించి వీరి బలాబలాలు, సమర్థత తదితరాలను సేకరించి వారిపై సీఎం అధ్యయనం ప్రారంభించారు. తొలి కేబినెట్‌లో మంత్రివర్గ కూర్పుపై విమర్శలు రావడంతో ఈసారి మంత్రిమండలి ఏర్పాటును ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. శాస్త్రీయంగా మంత్రిపదవులు కేటాయించాలని సీఎం భావిస్తున్నారు.

దీనికి అనుగుణంగా పని కోసం మంత్రులను నియమించాలని యోచిస్తున్నారు. వాటితో పాటు ప్రభుత్వ ప్రాధాన్యాలు, ప్రజల అవసరాలు, సమస్యలను తీరుస్తారని నమ్మకమున్న వారిని అమాత్య యోగం వరించనుంది. పార్టీకి వందశాతం విధేయులనే మంత్రివర్గంలోకి తీసుకోవాలని, పనితీరు ప్రాతిపదికనే సహచరులను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి భావన.

అలాగే వీటితో పాటు సామాజిక సమీకరణాలు విస్తరణలో ప్రముఖపాత్ర పోషించనున్నాయి. ప్రధాన కులాలకు ఎలాంటి ప్రాధాన్యత కల్పించాలి, ఉద్యమకారులు, భారీ మెజారిటీ, మహిళలు ఇలా చాలా అంశాలు కేబినెట్ కూర్పులో ప్రధాన భూమిక పోషించనున్నాయి.

ఈసారి పాత మంత్రులను మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేక కొత్త వారికే అవకాశం ఇస్తారా అంటూ సాగుతున్న చర్చకు తెరదించుతూ.. పాత మంత్రుల్లో సమర్థవంతంగా పనిచేసిన వారికి రెండోసారి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు.

ఈ ఎంపికలో వారు తమ పదవీకాలంలో సాధించిన ఫలితాలు, విమర్శలు ఎన్నికల్లో వారి విజయాలపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టారు. అలాగే శాసనసభాపతి, ఉపసభాపతి ఎంపికపైనా కేసీఆర్ కసరత్తు చేశారు. మంచి వాగ్ధాటి, సమయస్ఫూర్తి, సహనం, ఇంగ్లీష్ నైపుణ్యం ఉన్న వారికి సభాపతి ఎంపికలో కీలకంగా మారనుంది.

ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకి: ఎర్రబెల్లికి ఈ సారైనా దక్కేనా

కేసీఆర్ క్యాబినెట్ పై కేటీఆర్ ముద్ర: లోకసభకు హరీష్ రావు?

నెలాఖరులో కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఎనిమిది మందికే ఛాన్స్?

 

click me!