అంతా తూచ్, ఆ వార్తల్లో నిజం లేదు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ

By Nagaraju penumalaFirst Published Jun 5, 2019, 5:16 PM IST
Highlights

ఉగ్రవాదం, మజ్లిస్ మతోన్మాదం, రౌడీయిజం విషయంలో గట్టిగా తిట్టాలని అమిత్ షా అంటారే తప్ప మందలించే సమస్యే లేదని స్పష్టం చేశారు. తనను అమిత్ షా మందలించారంటూ వచ్చిన వార్తను చూసి నవ్వుకున్నానని తెలిపారు. 

ఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తనను మందలించారంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. అమిత్ షా తనను మందలించారన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. 

ఉగ్రవాదం, మజ్లిస్ మతోన్మాదం, రౌడీయిజం విషయంలో గట్టిగా తిట్టాలని అమిత్ షా అంటారే తప్ప మందలించే సమస్యే లేదని స్పష్టం చేశారు. తనను అమిత్ షా మందలించారంటూ వచ్చిన వార్తను చూసి నవ్వుకున్నానని తెలిపారు. 

ఢిల్లీలో ఓ న్యూస్ ఛానెల్ తో మాట్లాడిన ఆయన ఉగ్రవాద దాడులకు హైదరాబాద్‌తో ముడిపెడుతూ తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్‌ పార్టీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదని,బీజేపీయే ప్రత్యామ్నాయం అని చెప్పుకొచ్చారు. 

రాబోయే రోజుల్లో బీజేపీ మరింత బలోపేతమై అధికారం చేజిక్కించుకోవడం ఖాయమన్నారు. విభజన చట్టంలోని హామీలు అమలు కోసం, తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత కోసం తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. హోంశాఖ సహాయమంత్రి అనేది పదవిలా కాకుండా ఒక బాధ్యతగా భావిస్తానని స్పష్టం చేశారు. నీతి నిజాయితీగా పనిచేస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. 

click me!