పీసీసీ పదవిపై ఆసక్తి లేదు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Published : Jun 05, 2019, 03:09 PM IST
పీసీసీ పదవిపై ఆసక్తి లేదు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

సారాంశం

సీసీ పదవిపై తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి తేల్చి చెప్పారు.


భువనగిరి:  పీసీసీ పదవిపై తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి తేల్చి చెప్పారు.

బుధవారం నాడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  భువనగరిలో మీడియాతో మాట్లాడారు. పీసీసీ చీఫ్  పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారని వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు.పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ రాజీనామా చేసే విషయమై తనకు తెలియదన్నారు. పీసీసీ పదవిపై తనకు ఆశ లేదన్నారు.

పీసీసీ పదవి కంటే పెద్ద పదవిని భువనగిరి ప్రజలు తనకు అప్పగించారని ఆయన చెప్పారు.  ప్రతిపక్షంలో ఉంటూ వైఎస్ఆర్, వైఎస్ జగన్  మాదిరిగా తాను ప్రజల కోసం పాటు పడతానని ఆయన తెలిపారు.  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోనని ఆయన హెచ్చరించారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్