
టీఆర్ఎస్ హైకమాండ్ ఇప్పుడు తన ఫోకస్ మొత్తం మునుగోడుపై పెట్టింది. ఆ నియోజకవర్గంలో ఇతర పార్టీల్లో ఉన్న ముఖ్యమైన నాయకులను తన పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా అక్కడ బలంగా ఉన్న కాంగ్రెస్ నేతలను తన వైపు లాగేసుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పలువురు కాంగ్రెస్ నేతలు ఇటీవలే టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఇంతకీ ఎందుకు ఆ నియోజకవర్గంపై టీఆర్ఎస్ అంతలా దృష్టి సారించింది.. ఎందుకు నాయకులను తనలో చేర్చుకోవాలని చూస్తోంది అంటే..?
దారుణం.. భిక్షాటన చేసి డబ్బులు తేలేదని.. కుమారుడిపై వేడి నూనె పోసిన తండ్రి...
మునుగోడు నియోజకవర్గం నుంచి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. అదే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. బీజేపీలో చేరుతారని ఇటీవల వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల ఆయన బీజేపీ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలవడం ఈ చర్చకు బలాన్ని చేకూరుస్తుంది. అయితే ఆయన పార్టీకీ రాజీనామా చేస్తే అక్కడ ఉప ఎన్నిక రావడం ఖాయమని టీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే ఆ స్థానాన్ని తన ఖాతాలో వేసుకోవాలని అధికార పార్టీ తహతహలాడుతోంది.
2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అనేక స్థానాలను కైవసం చేసుకున్నా.. కాంగ్రెస్ బలంగా ఉన్న కొన్ని చోట్ల మాత్రం ఓడిపోయింది. అందులో మునుగోడు స్థానం కూడా ఉంది. అయితే గత సారి అక్కడ ఓడిపోవడానికి కారణం ఏంటనే విషయంపై దృష్టి కేంద్రీకరించిన హైకమాండ్.. ఇప్పుడు వాటిని సరి చేసుకునే పనిలో పడింది. అందులో భాగంగానే గట్టుపల్ మండల ఏర్పాటును చేస్తామని ప్రకటించారు. అలాగే ఆ నియోజకవర్గం వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే భూ నిర్వాసితులకు నష్టపరిహారం అందించడం, అసంపూర్తిగా మిగిలిపోయిన పెండింగ్ రిజర్వాయర్లను పూర్తి చేయడం, రోడ్లను నిర్మించడం వంటి పనులపై ఫోకస్ పెట్టింది.
లాల్ దర్వాజ బోనాలు : మరో మహిళ చేతికి బోనం, అమ్మవారిని దర్శించుకోకుండానే వెళ్ళిపోయిన షర్మిల
ఈ పరిణామాలు అన్నింటిని చూస్తే ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ కార్యాచరణ ప్రారంభించిందని తెలుస్తోంది. వాస్తవానికి రాజ్ గోపాల్ రెడ్డి అమిత్ షాతో భేటి అయిన తెల్లారే సీఎం కేసీఆర్, ఆ జిల్లా మినిస్టర్ జగదీష్ రెడ్డి మధ్య సమావేశం జరిగింది. ఉప ఎన్నికపై చర్చ జరిగింది. ఈ సారి టీఆర్ఎస్ అక్కడ గెలిచేందుకు చేపట్టాల్సిన వ్యూహాలపై చర్చ జరిగిందని సమాచారం. ఈ సారి ఎట్టి పరిస్థితిల్లోనూ మునుగోడులో గెలిచి తీరాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.
ఈ చర్చల అనంతరం పార్టీ ఓటమిపై ప్రభావం చూపే అన్ని అంశాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని టీఆర్ఎస్ భావించింది. అందులో భాగంగానే చేరికలను ప్రోత్సహిస్తోంది. గట్టుపల్ మండల సాధన కమిటీ లీడర్లు అందరినీ పార్టీలో చేర్చుకోవాలని నాయకులు ప్రయత్నిస్తున్నారు. అయితే వారు మాత్రం ఈ అంశంపై స్పందించడం లేదు. అయితే పలువురు లోకల్ లీడర్లను టీఆర్ఎస్ లో చేర్చుకోవడంలో ఆ పార్టీ నాయకులు సక్సెస్ అయ్యారు. నాంపల్లి మండలం ముస్టిపల్లి సర్పంచ్, ఎంపీటీసీలు నిన్న (ఆదివారం) పార్టీలో చేరారు. వారిని మంత్రి జగదీశ్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. మరి కొందరిని చేర్చుకోవాలని ప్రయత్నాలు వేగవంతం చేశారు.
కేసీఆర్‌కు పాలన చేతకావడం లేదు.. ఈసారి ఇంటికే : రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
ఇదిలా ఉండగా.. తాను రాజీనామా చేయబోనని, టీఆర్ఎస్ నేతలు తనపై కావాలనే రెచ్చగొట్టే కామెంట్స్ చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను బీజేపీలో చేరబోనని, అలాంటిదేమైనా ఉంటే తన నియోజకవర్గ ప్రజలతో, పార్టీ శ్రేణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కాగా మంత్రి జగదీశ్ రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిని, బీజేపీని టార్గెట్ గా చేసుకొని వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి తన బిజినెస్ లతోనే ఎప్పుడూ తీరకలేకుండా ఉంటారని ఆరోపించారు. అలాగే బీజేపీ విధానాలను ఎత్తి చూపుతూ విమర్శలు చేస్తున్నారు.