పగటి వేషగాళ్ల మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరు - అమిత్ షా టూర్ పై మినిస్టర్ కొప్పుల ఈశ్వర్ ఫైర్..

By Asianet NewsFirst Published Apr 24, 2023, 12:15 PM IST
Highlights

తెలంగాణ ప్రజలు పగటి వేషగాళ్ల మాటలు నమ్మరని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలోని ఏ బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా అమలు కావడం లేదని చెప్పారు. 

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనపై రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పగటి వేషగాళ్ల మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరు అంటూ విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రజల మనిషి అని, రాష్ట్ర సంక్షేమం ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎన్నికల ముందు సభలు, సమావేశాలు పెట్టు కొని పబ్బం గడిపేవారు కాదని, అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారం లోకి రాలేదని అన్నారు.

మహారాష్ట్రలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు.. దానికి మేం సిద్దంగా ఉన్నాం - మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు

Latest Videos

తెలంగాణ ప్రజలు తమను ఆదరించారని, ఆశీర్వదించారని కొప్పుల ఈశ్వర్ అన్నారు. అందుకే తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఈ విషయాన్ని గ్రహించాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కిందని ప్రశంసించారు. దళితులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో మంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. అలాంటి పథకాలు ఏ బీజేపీ ప్రాంతంలోనూ అమలు చేయడం లేదని ఆరోపించారు.

ఈత రాకపోయినా భార్య దూకిందనుకొని బావిలో దూకిన భర్త.. కానీ పొలంలోనే ఏడుస్తూ ఉన్న భార్య.. చివరికి ఏం జరిగిందంటే ?

బీఆర్ఎస్ కు దేశంలోని అన్ని వర్గాల నుంచి మంచి ఆదరణ వస్తోందని మంత్రి అన్నారు. దీనిని చూసి బీజేపీ నేతల మైండ్ బ్లాక్ అవుతోందని తెలిపారు. తమ పార్టీ ప్రతిష్ట దెబ్బ తీయాలన్న కుట్రలు, కుతంత్రాలు పని చేయబోవని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణ సమాజం గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఏం తెలుసు అని ఆయన ప్రశ్నించారు. 

విషాదం.. కైవల్యా నదిలో మునిగి ఇద్దరు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన

ఇక ఇప్పుడైనా తెలంగాణ బీజేపీ నేతలు చెప్పుడు మాటలు వినకుండా.. కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తుందో చెప్పాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. బీజేపీ ప్రభుత్వం ఎలాంటి పథకాలు అమలు చేస్తుందో చెప్పుకోవాలని అన్నారు. సీఎం కేసీఆర్ పై, బీఆర్ఎస్ విమర్శలు మానుకోవాని ఆయన అన్నారు. లేకపోతే తెలంగాణ ప్రజలే తరిమికొడతారని తెలిపారు. 

click me!