అక్కలను చంపిన ఉన్మాది ఆత్మహత్య: హైదరాబాద్ ఇంట్లో కుళ్లిన శవం

Published : Jul 02, 2020, 07:35 AM IST
అక్కలను చంపిన ఉన్మాది ఆత్మహత్య: హైదరాబాద్ ఇంట్లో కుళ్లిన శవం

సారాంశం

హైదరాబాదులో ఉన్మాదంతో ఇద్దరు అక్కలను చంపిన ఉన్మాది ఇస్మాయిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాదులోని పాతబస్తీలో గల తన ఇంట్లో అతను ఉరేసుకుని మరణించాడు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఇద్దరు అక్కలను చంపిన ఉన్మాది ఇస్మాయిల్ (31) ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఇటీవల తన ముగ్గురు అక్కలపై దాడి చేశాడు. వారిలో ఇద్దరు చనిపోగా, మరో అక్క ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దాంతో ఇస్మాయిల్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

రెండు రోజుల తర్వాత ఉరివేసుకుని శవమై ఇస్మాయిల్ తన ఇంట్లోనే పోలీసులకు కనిపిం్చాడు .హైదరాబాదులోని పాతబస్తీ బార్కాస్ సలాలా ప్రాంతానికి ెచందిన అహ్మద్ బిన్ సాలం బా ఇస్మాయిల్ సోమవారం రాత్రి అక్కలను విందుకు పిలిచాడు. ఐదుగురు అక్కల్లో ఇద్దరు విందుకు వచ్చారు. వారితో మాట్లాడుతూనే అతను వారిపై కత్తితో దాడి చేశాడు. 

ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆ తర్వాత స్కూటీపై నబీల్ కాలనీలో నివాసం ఉంటున్న మరో అక్క ఇంటికి వెళ్లి, అక్కడ ఆమెపై దాడి చేశాడు. అడ్డు వచ్చిన బావపై కూడా దాడి చేశారు. వారిద్దరు గాయపడి ఆస్పత్రిలో చేరారు. 

Also Read: భార్యను చంపిన కేసులో నిందితుడు: ముగ్గురు అక్కలపై దాడి, ఇద్దరు మృతి

అప్పటి నుంచి పోలీసులు ఇస్మాయిల్ కోసం గాలిస్తున్నారు. ఇస్మాయిల్ తీసుకుని వెళ్లిన స్కూటీ అతడి ఇంటి వెనకు ఉన్న ఖాళీ ప్లాట్ లో ఉందని పోలీసులకు బుధవారం సాయంత్రం సమాచారం అందింది. పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని, కిటికీ ద్వారా ఇంట్లోకి చూశారు. అతను లోపల ఫ్యాన్ కు ఉరివేసుకుని కనిపించాడు. 

ఇంటికి బయటి నుంచి తాళం వేసి ఉంది. అయితే, అతను ఇంటి వెనక నుంచి లోనికి ప్రవేశించి ఉంటాడని భావిస్తున్నారు. తల్లికి సమాచారం ఇచ్చి అతని శవాన్ని పోలీసులు అస్పత్రికి తరలించారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉంది. దాంతో అక్కలను హత్య చేసిన రాత్రే అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ