అంతర్జాతీయ ప్రమాణాలతో డాగ్ పార్క్

By rajesh yFirst Published Sep 10, 2018, 5:17 PM IST
Highlights

 తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సరికొత్త అద్భతాన్ని సృష్టించారు. ఎప్పుడూ తన శాఖలో వినూత్న ప్రయోగాలు చేస్తూ అందర్నీ ఆకర్షించే కేటీఆర్ తాజాగా మరో  ప్రయోగం చేశారు. కొండాపూర్ లో డాగ్ పార్క్ ను నిర్మించి భారతదేశంలోనే తొలి పెట్ పార్క్ నిర్మించిన వ్యక్తిగా రికార్డుల్లోకెక్కారు కేటీఆర్. 
 

హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సరికొత్త అద్భతాన్ని సృష్టించారు. ఎప్పుడూ తన శాఖలో వినూత్న ప్రయోగాలు చేస్తూ అందర్నీ ఆకర్షించే కేటీఆర్ తాజాగా మరో  ప్రయోగం చేశారు. కొండాపూర్ లో డాగ్ పార్క్ ను నిర్మించి భారతదేశంలోనే తొలి పెట్ పార్క్ నిర్మించిన వ్యక్తిగా రికార్డుల్లోకెక్కారు కేటీఆర్. 

కొండాపూర్ రాడిసన్ హోటల్ సమీపంలోని చిన్న డంపింగ్ యార్డులో ఈ పెట్ పార్క్ నిర్మించారు. దానికి డాగ్ పార్క్ అంటూ నామకరణం సైతం చేశారు. చిన్న డంపింగ్ యార్డులో చేపట్టిన ఈ పార్క్ దాదాపు 1.3 ఎకరాలకు విస్తరించినట్లు కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ పార్క్ ను కోటి 10 లక్షల రూపాయలతో నిర్మించినట్లు స్పష్టం చేశారు.

  

భారతదేశంలోనే తొలిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పెట్ పార్క్ గా డాగ్ పార్క్ ను నిర్మించారు. జంతువులు, వాటి తల్లులు సంచరించేందుకు వీలుగా ట్రేక్ లను సైతం నిర్మించారు. ఈ పార్క్ ను కెన్నెల్ క్లబ్ ఆఫ్ ఇండియా గుర్తింపు కూడా లభించినట్లు తన ట్వీట్ ద్వారా తెలిపారు.  

 

click me!