కాంగ్రెస్ అసమర్థత వల్లే రైతులు నష్టపోతున్నారు.. : మంత్రి కేటీఆర్

By Mahesh Rajamoni  |  First Published Oct 21, 2023, 5:56 PM IST

Hyderabad: కాంగ్రెస్ అసమర్థత వల్లే రైతులు నష్టపోతున్నార‌ని భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అసమర్థత గురించి తెలంగాణలోని రైతులకు తెలుసనీ, ఇప్పుడు కర్ణాటకలోని రైతులు కూడా అదే అనుభవిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
 


BRS working president KTR: భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మ‌రోసారి కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సరిపడా విద్యుత్‌ సరఫరా చేయడంలో విఫలమవడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు నిరసనలు చేపడుతున్నారనీ, కాంగ్రెస్‌ పార్టీ అసమర్థత తెలంగాణలోని రైతులకు తెలుసని అన్నారు. ఇప్పుడు కర్ణాటకలోని వారి సహచరులు అదే అనుభవిస్తున్నారని అన్నారు. కేటీఆర్ శనివారం ఒక‌ ట్వీట్ లో..  "రైతులకు విద్యుత్‌ అందించడంలో కాంగ్రెస్‌ అసమర్థత దశాబ్దాలుగా తెలంగాణలో అందరికీ తెలిసిందే. ఇప్పుడు కర్ణాటక రైతులు కూడా అదే అనుభవాన్ని అనుభవించడం ప్రారంభించినట్లు కనిపిస్తోంది" అని పేర్కొన్నారు.

కాగా, కర్నాటక ప్రభుత్వం రైతాంగానికి కరెంటు ఇవ్వడానికి నానా తంటాలు పడుతోంది. వ్యవసాయ రంగానికి సరిపడా విద్యుత్‌ సరఫరా చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమవడంపై రైతులు మండిపడుతున్నారు. యాదగిరిలో ఏడు గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో జెస్కామ్‌ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో జిల్లాలో మిర్చి, పత్తి, ఎర్రజొన్న, వరి పంటలు చాలా వరకు దెబ్బతిన్నాయని రైతులు వాపోయారు. షిఫ్టుల వారీగా ఐదు గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కే జార్జ్ తెలిపారు. టీవీలు, రేడియో, ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విద్యుత్ సరఫరా సమయాలను రైతులకు తెలియజేస్తామని ఆయన చెప్పారు.

Latest Videos

అంత‌కుముందు,  కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి చేస్తున్నాయనీ, అసెంబ్లీ ఎన్నికలు ఢిల్లీ, గుజరాత్ అహంకార నాయకులకు, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరిగే యుద్ధం అని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ను అణచివేసి తెలంగాణకే పరిమితం చేసి మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలకు విస్తరించడానికి కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయని  ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కేవ‌లం ఒక నెల మాత్ర‌మే ఉన్న త‌రుణంలో మరోసారి అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని చూస్తున్న బీఆర్ఎస్.. బీజేపీ, కాంగ్రెస్ ల‌ను టార్గెట్ చేస్తూ.. అవినీతి, రాజవంశ రాజకీయాల దాడుల మధ్య తన ప్రచారానికి ప్రాంతీయ అంశాలు, తెలంగాణ ఆత్మ‌గౌర‌వం, ప్ర‌జా పోరాట స్ఫూర్తిని కేంద్రంగా చేసుకుంది. గత ఎన్నికల సమయంలో ఆంధ్రా భూస్వాముల అంశం గురించి ప్ర‌స్తావించిన కేటీఆర్.. సారి గుజరాత్‌లోని గులామ్‌లపై, ఢిల్లీ దర్బార్ లు అంటూ బీజేపీ, కాంగ్రెస్ లపై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు.

click me!