కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు మంత్రి హరీశ్ రావు . అభ్యర్ధులే లేని కాంగ్రెస్‌కు గాలి వీస్తోందా అని సెటైర్లు వేశారు. అబద్ధాలతో ప్రజలను మోసం చేయాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నాని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు మంత్రి హరీశ్ రావు. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో చెరకు సుధాకర్ .. కేటీఆర్, హరీశ్‌రావుల సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. అభ్యర్ధులే లేని కాంగ్రెస్‌కు గాలి వీస్తోందా అని సెటైర్లు వేశారు. అబద్ధాలతో ప్రజలను మోసం చేయాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నాని ఆయన ఆరోపించారు. చెరకు సుధాకర్ బీఆర్ఎస్‌లో చేరడం సంతోషకరమన్నారు.
ఆయన కరడుగట్టిన తెలంగాణ ఉద్యమవాది అని హరీశ్ రావు ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమంలో సుధాకర్ తీవ్రంగా శ్రమించారని మంత్రి గుర్తుచేశారు. ఉద్యమ సమంలో రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయిన వ్యక్తి ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు అంటూ కిషన్ రెడ్డిపై విమర్శలు చేశారు హరీశ్ రావు. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన ఘనత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిదన్నారు. రేవంత్ రెడ్డి సీట్లు అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ నేతలే ఆరోపిస్తున్నారని హరీశ్ రావు చురకలంటించారు. సోనియాను అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు.
undefined
Also Read: మేం ఎవరి బీ-టీమ్ కాదు.. తెలంగాణకు ఏ-టీమ్: కాంగ్రెస్, బీజేపీలపై కేటీఆర్ ఫైర్
కర్ణాటకలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని.. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తోందని హరీశ్ రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను కాంగ్రెస్ కాపీ కొట్టిందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ మళ్లీ గెలవాలి.. తెలంగాణ అభివృద్ధి పరుగులు పెట్టాలని హరీశ్ రావు ఆకాంక్షించారు. పనితనం తప్ప.. పగతనం లేని నాయకుడు కేసీఆర్ అని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ అంటేనే మాటలు, ముఠాలు, మంటలు అని హరీశ్ చురకలంటించారు. కేసీఆర్ హయాంలో కరువు, మత కలహాలు లేకుండా రాష్ట్రం ప్రశాంతంగా వుందని మంత్రి చెప్పారు.