Harish Rao : గులాబీ పార్టీ ట్రబుల్ షూటర్.. ఆరడుగుల బుల్లెట్.. తన్నీరు హరీష్ రావు రాజకీయ ప్రస్థానం..

By Rajesh Karampoori  |  First Published Nov 11, 2023, 4:05 PM IST

Harish Rao : మేనమామ కేసీఆర్ వద్ద రాజకీయ ఓనమాలు నేర్చుకున్న హరీష్ రావు (Thaneeru Harish Rao)..  32 ఏళ్ల వయస్సులోనే తొలిసారి అసెంబ్లీ ఎన్నిక‌ల బరిలోని నిలిచి గెలుపొందారు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా తన రికార్డులు తానే బద్దలు కొట్టుకుంటూ.. అతి చిన్న వయస్సులో ఒకే నియోజక వర్గం నుంచి వ‌రుస‌గా ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత తన సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్య, ఆర్ధిక శాఖలను చూసుకుంటున్న గులాబీ పార్టీ ట్రబుల్ షూటర్, మంత్రి  హరీష్ రావు రాజకీయ ప్రస్థానం ఇదే.. 


Harish Rao :  మృదు స్వభావం.. కటువైన సంకల్ప బలం.. లక్ష్యం ఏదైనా తెగించే సత్తువ బీఆర్ఎస్ కీలక నేత, ట్రబుల్ షూటర్, మంత్రి హరీష్ రావు (Thaneeru Harish Rao) సొంతం. ఆయన మాటల్లో చతురత.. చేతల్లో కార్యశీలత.. ప్రత్యర్థిని సైతం తన వైపు తిప్పుకునే రాజనీతిజ్ఞత.. ఇవే హరీష్ రావును తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక నేతగా నిలబెట్టాయి. నమ్మిన సిద్ధాంతాన్ని, నమ్ముకున్న వారికి వెన్నంటే ఉంటారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అలుపెరుగని పోరాటం చేసే నాయకుడు హరీష్ రావు. గులాబీ పార్టీ ట్రబుల్ షూటర్ గా పేరుగావించిన మంత్రి తన్నీరు హరీష్ రావు (Thaneeru Harish Rao) రాజకీయ ప్రస్థానం ఇదే.. 

తొలుత గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు( CM KCR) మేనల్లుడుగా రాజకీయాల్లో అడుగుపెట్టిన హరీష్ రావు.. తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి చాలానే శ్రమించారనే చెప్పాలి. మామ కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ.. ఆయన చెప్పిన ప్రతి పనిని తూ.చ. తప్పకుండా చేసే నాయకుడు అని టిఆర్ఎస్ వర్గాలు చెబుతుంటాయి. సూటిగా, పదులుగా మాట్లాడే హరీష్ రావు.. ఎక్కడ కాలు పెడితే అక్కడ గులాబీ పార్టీ గెలుపు ఖాయమని పలు సందర్భాల్లో నిరూపితమైంది. ఆరగుడుల బుల్లెట్.. ట్రబుల్ షూటర్, తనను మించిన నాయకుడు అంటూ కేసీఆరే స్వయంగా వ్యాఖ్యానించారంటే తెలంగాణ రాజకీయాల్లో హరీష్ రావు ప్రత్యేకతేంటో అర్థం చేసుకోవచ్చు.  

Latest Videos

undefined

వ్యక్తిగత  జీవితం 

తన్నీరు హరీష్ రావు (Harish Rao) 1972 జూన్ 3న సత్యనారాయణ-లక్ష్మీబాయి దంపతులకు మెదక్ జిల్లా సిద్దిపేట సమీపంలో చింతమడక గ్రామంలో జన్మించాడు. హరీష్ రావు  తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. ప్రాథమిక వాణినికేతన్ పాఠశాలలో పూర్తి చేశారు. ఆ తరువాత హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో డిప్లొమా పూర్తి చేసి.. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు.  హరీష్‌రావుకు శ్రీనితరావుతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు ఆర్చిష్మాన్, కుమార్తె వైష్ణవి.

రాజకీయ జీవితం

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) మేనల్లుడిగా చిన్నతనం నుంచే రాజకీయ ఓనమాలు నేర్చుకున్న హరీశ్. చదువుకునే రోజుల నుంచి మామ కేసీఆర్ కి చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని వ్యవహారాలను చక్కబెట్టి వారు. కేసీఆర్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి.. ప్రత్యేక తెలంగాణ కోసం పార్టీ స్థాపించిన తర్వాత అందులో క్రియాశీలకంగా అయ్యారు. ఉద్యమం తొలినాళ్ల నుంచి మేనమామ కేసీఆర్ వెంట అడుగులు వేస్తూ ప్రతి చోట తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్లారు. తన మామ కలను..తెలంగాణ ప్రజల ఆకాంక్షని నెరవేర్చడంలో తనదైన పాత్ర పోషించారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకంగా వ్యహరించారు హరీష్ రావు. 

ఈ తరుణంలో 2004లో జరిగిన ఉపఎన్నికల్లో తొలిసారి తన మామ రాజకీయ చేసిన సిద్దిపేటలో ఎమ్మెల్యేగా బరిలో దిగి.. 24,829 ఓట్ల తేడాతో గెలుపొందారు. అనంతరం తెలంగాణ కోసం రాజీనామా చేసి.. 2008 ఉపఎన్నికల్లో ఇదే స్థానం నుంచి రెండోసారి మళ్లీ 58,935 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక 2009 అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ  సిద్ధిపేట నుంచి పోటీ చేసిన హరీష్ రావు  హ్యాట్రిక్  విజయం సాధించారు. తన సమీప అభ్యర్ధిపై 64,677 ఓట్ల తేడాతో గెలిచారు. అలాగే 2010లో జరిగిన ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసి.. ఆయ‌న త‌న స్థానాన్ని తిరిగి నిల‌బెట్టుకున్నారు.

కేసీఆర్ మేనల్లుడిగా తెరపై వచ్చినప్పటికీ ఆ తర్వాత తన సత్తా ఏమిటో నిరూపించుకోవడానికి ఎంతగానో శ్రమించిన నేత హరీష్ రావు. 2004 నుంచి 2014 వరకు తనదైన శైలిలో చట్టసభలో తెలంగాణ వాణిని బలంగా వినిపించారు. అందుకే 14 ఏళ్ల ప్రత్యేక తెలంగాణ ఉద్యమ పోరాట ప్రస్థానంలో హరీష్ రావు పేరు విస్మరించలేనిది. ఒక్కమాటలో చెప్పాలంటే.. హరీష్ ప్రజానేత.  క్షేత్రస్థాయిలో యువత శ్రేణులను సమీకరించి.. ప్రత్యర్థులకు గుండెల్లో గుబులు పుట్టించే వ్యూహ చతురత హరీష్ స్వంతం. గులాబీ బాస్ కేసీఆర్ తీసుకుని ప్రతి కీలక నిర్ణయాల్లో ప్రధాన పాత్రధారిగా.. మామ అడుగుజాడల్లో నడిపించే నమ్మిన బంటుగా పేరుగాంచారు. 

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తరువాత 2014 ఎన్నికల్లో సిద్ధిపేట నుంచే మరోసారి బరిలోకి దిగి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలుపొందటమే కేసీఆర్ క్యాబినేట్ స్థానం దక్కించుకున్నారు. రాష్ట్ర సాగునీరు, మార్కెటింగ్ అండ్ శాస‌న‌సభ వ్యవ‌హ‌రాల శాఖ మంత్రిగా సేవలందించారు. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హ‌రీష్ రావు రికార్డు స్థాయిలో 1,20,650 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొంది తన రికార్డులు తానే బద్దలు కొట్టుకుంటున్నాడు. అలాగే.. అతి చిన్న వయస్సులో ఒకే నియోజక వర్గం నుంచి వ‌రుస‌గా ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత తన సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్య, ఆర్ధిక శాఖలను చూసుకుంటున్న హరీష్ రావు..

 హరీశ్ రావు తన రాజకీయ జీవితంలో అనేక అవమానాలు పడ్డారు. ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్న ఆయన తనంతట తానే దిగమింగుకున్నారు తప్ప ఎన్నడు సీఎం కేసీఆర్ పేరు ప్రఖ్యాతులకు భంగం కలిగించలేదు. ఇదే ఆయనకు ప్రజల మనిషిగా.. కేసీఆర్ నమ్మిన మనిషిగా చేసింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ సిద్ధిపేట నియోజకవర్గం నుంచి హరీశ్ రావు పోటీ చేస్తున్నారు. ఈ సారి గత రికార్డులను తిరగరాశారని పార్టీ శ్రేణులు దీమా వ్యక్తం చేస్తున్నారు.
 

click me!