తెలంగాణలో పింక్ వేవ్ ఒక్కటే .. రేవంత్, ఈటలకు వాతలు తప్పవు : కల్వకుంట్ల కవిత

By Siva Kodati  |  First Published Nov 11, 2023, 3:54 PM IST

కర్ణాటక కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హామీలు అమలు చేయలేని స్థితిలో వున్న కర్ణాటక సీఎం.. బీసీలకు ఏం చేయాలో కేసీఆర్‌కు పాఠాలు చెబుతున్నారని కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. 


కర్ణాటక కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నిజామాబాద్‌లో శనివారం గోసంగి సామాజికవర్గం ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ..  రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్‌లు రెండు స్థానాల్లో పోటీ చేస్తుండటంపై సెటైర్లు వేశారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా రేవంత్, ఈటల తీరు వుందన్నారు. కర్ణాటకలో చక్కగా లేదు కానీ .. అక్కడి సీఎం కామారెడ్డికి వచ్చి మాట్లాడుతున్నారని సిద్ధరామయ్యపై వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై ఆలోచించి ఓటు వేయాలని కవిత సూచించారు. 

రాష్ట్రంలో పింక్ వేవ్ తప్ప మరో వేవ్ లేదని.. బీసీలకు ఒక్క డిక్లరేషన్ ఇవ్వని కాంగ్రెస్ , బీసీ డిక్లరేషన్ ప్రకటించడం హాస్యాస్పదమంటూ ఎద్దేవా చేశారు. ఫెయిల్యూర్ సీఎంను తీసుకొచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సర్వేలతో సోషల్ మీడియాలో ప్రచారం చేసినంత మాత్రాన అధికారంలోకి రారని కవిత పేర్కొన్నారు. తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన కేసీఆర్‌ను విమర్శించే హక్కు సిద్ధరామయ్యకు లేదన్నారు. 

Latest Videos

ALso REad: కేసీఆర్‌ను విమర్శించే అర్హత సిద్ధరామయ్యకు లేదు.. కాంగ్రెస్ పై ఎమ్మెల్సీ క‌విత ఘాటు వ్యాఖ్య‌లు

కర్ణాటకలో మాదిరిగా కాకుండా ఇచ్చిన హామీలను అమలు చేసిన చరిత్ర కేసీఆర్‌దని కవిత అన్నారు. తెలంగాణకు వచ్చే ముందు ఇక్కడి స్థితిగతులన్నింటినీ తెలుసుకోవాలని ఆమె చురకలంటించారు. కాంగ్రెస్ భయానక పాలనను ప్రజలు ఒక్కసారి గుర్తుతెచ్చుకోవాలని కవిత పేర్కొన్నారు. హామీలు అమలు చేయలేని స్థితిలో వున్న కర్ణాటక సీఎం.. బీసీలకు ఏం చేయాలో కేసీఆర్‌కు పాఠాలు చెబుతున్నారని కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. 

click me!