సీఐ నాగేశ్వరరావుపై కఠిన చర్యలు తీసుకోండి.. లేకపోతే పోలీసుశాఖకు చెడ్డపేరు: టీజీ వెంకటేష్

Published : Jul 10, 2022, 02:22 PM IST
సీఐ నాగేశ్వరరావుపై కఠిన చర్యలు తీసుకోండి.. లేకపోతే పోలీసుశాఖకు చెడ్డపేరు: టీజీ వెంకటేష్

సారాంశం

వివాహితపై అత్యాచారం, హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వరరావును కఠినంగా శిక్షించాలని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్‌ డిమాండ్ చేశారు. సీఐ నాగేశ్వరరావు ఎంతో మంది భవిష్యత్తును నాశనం చేసే విధంగా చేస్తున్నారని ఆరోపించారు.

వివాహితపై అత్యాచారం, హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వరరావును కఠినంగా శిక్షించాలని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్‌ డిమాండ్ చేశారు. సీఐ నాగేశ్వరరావు ఎంతో మంది భవిష్యత్తును నాశనం చేసే విధంగా చేస్తున్నారని ఆరోపించారు. తనను ఓ ఆస్తి కేసులో అన్యాయంగా ఇరికించాడని అన్నారు. తనకు సంబంధం లేదని చెప్పినా.. కేసు నుంచి పేరు తొలగించడంలో జాప్యం చేశాడని తెలిపారు. ఫిర్యాదుచేసిన వారు తనకు సంబంధం లేదని చెప్పిన వినిపించుకోలేదని చెప్పారు. 

ఉన్నతాధికారులు, నేతలకు రూ.కోట్లు ఇచ్చి పోస్టింగ్‌ తెచ్చుకున్న తనకు అంతే డబ్బు కావాలని నాగేశ్వరరావు ప్రచారం చేసుకున్నాడని టీజీ వెంకటేశ్ ఆరోపించారు. ఈ విధంగా చేయడం ద్వారా పై అధికారులకు, నాయకులకు చెడ్డపేరు తీసుకొచ్చేలా చేశాడని విమర్శించారు. నాగేశ్వరరావును కఠినంగా శిక్షించాలని లేకపోతే పోలీసుశాఖకు చెడ్డపేరు వస్తుందన్నారు. ఈ మేరకు టీజీ వెంకటేశ్ ఓ వీడియో విడుదల చేశారు. 

Also Read: వివాహితపై రేప్: సస్పెండైన సీఐ నాగేశ్వర్‌రావుపై పలు కేసులు

ఇక, జూన్ నెలాఖరులో మారేడ్‌పల్లి సీఐగా బాధ్యతలు చేపట్టకముందు.. నాగేశ్వరరావు టాస్క్‌ఫోర్స్‌లో, బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఎస్‌హెచ్‌వోగా విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలోనే ఆయన పలు హై ప్రొఫైల్ కేసులలో దర్యాప్తు అధికారిగా ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసుకు నాయకత్వం వహించారు. అదే నెలలో సీనియర్ రాజకీయ నాయకులు టీజీ వెంకటేష్, ఆయన బంధువు టీజీ విశ్వప్రసాద్, 80 మందిపై నమోదైన భూ ఆక్రమణకు సంబంధించిన మరో కేసును ఆయన హ్యాండిల్ చేశారు. 

ఇటీవల యువ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య కేసు, నిర్మాణంలో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన దొంగతనంపై విచారణకు కూడా ఆయన నాయకత్వం వహించారు.

అయితే శుక్రవారం వనస్థలిపురం పోలీసు స్టేషన్‌లో నాగేశ్వర్‌రావుపై కేసు నమోదైంది. వనస్థలిపురం పరిధిలోని హస్తినాపురంలోని నివాసం ఉంటున్న మహిళ.. నాగేశ్వర్‌రావు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. అంతేకాకుండా తుపాకీతో బెదిరింపులకు పాల్పడినట్టుగా తెలిపింది. తనతో పాటు తన భర్తను సిటీ విడిచి పెట్టి వెళ్లాలని బలవంతం చేశాడని.. కారులో ఎక్కించుకుని వెళ్లేందుకు ప్రయత్నించాడని చెప్పింది. కారులో ఎక్కించుకుని వెళ్లేందుకు ప్రయత్నించాడని.. ఇబ్రహీంపట్నం వద్ద వాహనం చిన్న ప్రమాదానికి గురైందని తెలిపింది. ఆ సమయంలో సీఐ నాగేశ్వర్ రావు బారి నుంచి తప్పించుకుని ఫిర్యాదు చేసినట్టుగా తెలిపింది. 

దీంతో పలు సెక్షన్ల కింద నాగేశ్వర్ రావుపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో నాగేశ్వర్ రావును సస్పెండ్ చేస్తున్నట్టుగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం నాగేశ్వర్ రావు పరారీలోనే ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్